ఈ ఏడాది జరగనున్న హజ్ యాత్రపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. కరోనా రెండో దశ కొనసాగుతున్నందున హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పక్షాన భారత్ నిలుస్తుందని చెప్పారు.
హజ్ యాత్ర సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సౌదీతో భారత్కు స్నేహపూర్వక సంబంధం ఉంది. సౌదీ తీసుకునే నిర్ణయాన్ని భారత్ గౌరవిస్తుంది. గత ఏడాది యాత్రను రద్దైంది. ఈ ఏడాది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
-ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి
విదేశీయులతో కలిపి హజ్ యాత్రకు ప్రతి ఏడాది 20లక్షల మంది హాజరవుతారు. 2019లో భారత్ నుంచి 2లక్షల మంది యాత్రకు వెళ్లారు.
ఇవీ చదవండి:'రాహుల్.. వ్యాక్సిన్లు ఏమవుతున్నాయో తెలీదా?'