హరియాణా ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సర్కార్ తన బలాన్ని నిరూపించుకుంది. హరియాణా అసెంబ్లీలో ప్రస్తుతం 88 సభ్యులుండగా.. ప్రభుత్వానికి అనుకూలంగా 55 మంది ఎమ్మెల్యేల ఓటు వేశారు. వ్యతిరేకంగా కేవలం 32 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ అనంతరం అవిశ్వాసం వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
హరియాణా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బీఎస్ హుడా.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇటీవల ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు అధికార పార్టీకీ మద్దతు ఉపసంహరించడం వల్ల భాజపా మెజార్టీ పడిపోయిందని కాంగ్రెస్ వాదించింది. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముందునుంచి చెప్పినట్లుగానే తమ బలాన్ని నిరూపించుకున్నారు.