ETV Bharat / bharat

భారత్​లో 'దక్షిణాఫ్రికా' కరోనా వేరియంట్​- నిజమెంత? - కరోనా ప్రమాదకర వేరియంట్​

దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసిన సీ.1.2 రకం కరోనా వేరియంట్​.. మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్​లో ఈ రకం కరోనా కేసులు నమోదయ్యాయా? లేదా? అన్న దానిపై ప్రభుత్వ వర్గాలు స్పష్టతనిచ్చాయి.

COVID-19 variant C.1.2
సీ.1.2 రకం కరోనా వేరియంట్​
author img

By

Published : Sep 1, 2021, 11:06 AM IST

Updated : Sep 2, 2021, 9:51 AM IST

దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన సీ.1.2 రకం కరోనా(c.1.2 variant)పై ప్రభుత్వ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేశాయి. దేశంలో ఈ వేరియంట్​కు సంబంధించి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పాయి. ఈ వేరియంట్​ వ్యాప్తి గురించి భయాందోళనలు వీడి, కరోనా నిబంధనలను ప్రజలంతా తప్పక పాటించాలని సూచించాయి.

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన సీ.1.2 రకం కరోనా వేరియంట్​(south africa covid variant) మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. సీ.1.2 రకం కరోనా(c.1.2 variant).. వ్యాక్సిన్ నుంచి లభించిన రక్షణను ఎదిరించి మరీ వ్యాపిస్తున్నట్లు వెల్లడైంది. దక్షిణాఫ్రికాకు చెందిన జాతీయ అంటువ్యాధుల సంస్థ(ఎన్ఐసీడీ), క్వాజులు-నేటల్ రీసర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్​ఫాం(క్రిస్ప్) సంస్థల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు.

అధిక మ్యుటేషన్..

సీ.1.2 రకం కరోనా కేసులు చైనా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లో బయటపడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణాఫ్రికాలో కరోనా ఫస్ట్ వేవ్​లో తీవ్ర ప్రభావం చూపించిన సీ.1 రకంతో పోలిస్తే సీ.1.2 వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని చెప్పారు. ఆందోళనకర వేరియంట్, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్​తో పోలిస్తే సీ.1.2లో మ్యుటేషన్లు అధికంగా ఉన్నాయని వివరించారు.

దక్షిణాఫ్రికా వేరియంట్​తో పాటు టీకాను ఎదిరించే మరో కరోనా రకం వెలుగులోకి వచ్చింది. దీనిపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ వేరియంట్ వివరాల కోసం లింక్​పై క్లిక్ చేయండి..

ఇదీ చూడండి: Corona cases in India: మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

Last Updated : Sep 2, 2021, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.