ETV Bharat / bharat

'భారత్​, చైనా సైన్యాల 14వ విడత చర్చల్లోనూ పురోగతి శూన్యం'

India China border talks: వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక ప్రతిష్టంభనపై భారత్-చైనా దేశాల మధ్య జరిగిన 14వ విడత చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఇరుపక్షాల మధ్య లోతైన చర్చ జరిగిందని సంయుక్త ప్రకటనలో భారత్-చైనా పేర్కొన్నాయి. చర్చలు కొనసాగించడానికి, మిగిలిన సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారించడానికి అంగీకరించుకున్నట్లు తెలిపాయి.

India China border talks
India China border talks
author img

By

Published : Jan 13, 2022, 7:15 PM IST

India China border talks: తూర్పు లద్దాఖ్​లో ఏర్పాడిన ప్రతిష్టంభనపై భారత్-చైనా మధ్య జరిగిన 14వ విడత చర్చల్లో పరిష్కారం దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రతిపాదనలు కొలిక్కి రాకపోవడం వల్ల.. చర్చలు ఫలప్రదం కాకుండానే ముగిశాయని రెండు దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి.

14th round India China border talks:

సరిహద్దులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇరుదేశాల బలగాలు వెనక్కి వెళ్లిపోగా.. మిగిలిన ప్రదేశాల్లో సమస్యల పరిష్కారానికి చర్చలు కొనసాగించాలని భారత్-చైనా నిర్ణయించాయి. సైనిక, దౌత్యపరమైన మాధ్యమాల ద్వారా సంప్రదింపులు చేసుకోవాలని అంగీకరించుకున్నాయి. ఇరు దేశాధినేతల మార్గనిర్దేశం ప్రకారం పరిష్కారం కోసం ప్రయత్నించాలని 14వ విడత చర్చల్లో అంగీకారానికి వచ్చాయి.

"ఇరుపక్షాలు ఎలాంటి దాపరికం లేకుండా లోతైన చర్చలు జరిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సమస్యల పరిష్కారంపై అభిప్రాయాలు పంచుకున్నాయి. పరిష్కారం ద్వారా శాంతి, సుస్థిరతకు ఆస్కారం ఉంటుందని... తద్వారా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి ఉంటుందని గుర్తించాయి. సైనిక, దౌత్యపరమైన మాధ్యమాల ద్వారా సంప్రదింపులు కొనసాగించి.. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వీలైనంత వేగంగా కనుక్కోవాలని అంగీకారానికి వచ్చాయి."

-భారత్-చైనా సంయుక్త ప్రకటన

Corps commanders meet India China

14వ విడత కార్ప్స్ కమాండర్ భేటీ బుధవారం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి చుషూల్-మోల్దో సరిహద్దు పాయింట్ వద్ద సమావేశం నిర్వహించారు. రక్షణ, విదేశాంగ శాఖ ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు.

అక్టోబర్ 10 జరిగిన పదమూడో విడత చర్చలు సైతం ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో తదుపరి విడత చర్చలు వీలైనంత త్వరగా నిర్వహించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించుకున్నాయి.

అలాంటి వ్యాఖ్యలు వద్దు: చైనా

మరోవైపు, సరిహద్దు సమస్యపై నిర్మాణాత్మకం కాని వ్యాఖ్యలు చేయొద్దని చైనా చెప్పుకొచ్చింది. తూర్పు లద్దాఖ్​లో సైనిక ముప్పు తొలగిపోలేదని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె బుధవారం పేర్కొన్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. ఇరుదేశాలు సైనిక, దౌత్య మార్గాల ద్వారా సమస్యలపై చర్చిస్తున్నాయని, ఇలాంటి సమయంలో ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్ సూచించారు.

ఇదీ చదవండి: చైనా క్రూరత్వం.. ఇనుప పెట్టెల్లో కొవిడ్ బాధితులు.. ముగ్గురికి జైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.