ETV Bharat / bharat

ఆస్తి కోసం ఆరుగురి వరుస హత్యల కేసు - ప్రధాన నిందితుడు సహా ఐదుగురి అరెస్ట్​ - నిజామాబాద్ కుటుంబ హత్య అప్‌డేట్

Nizamabad Family Murder Case Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుగురి కుటుంబ సభ్యుల హత్య కేసులో విస్తుపోయే విషయాలను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ వెల్లడించారు. స్నేహితుడు ప్రసాద్‌ ఇంటిని సొంతం చేసుకోవడానికే ప్రధాన నిందితుడు ప్రశాంత్‌ అత్యంత పాశవికంగా ఆరుగురిని చంపాడని తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడతామని సింధూ శర్మ స్పష్టం చేశారు.

Nizamabad  Serial killer murder case
ఆస్తి కోసమే ఆరుగురిని కిరాతకంగా చంపిన దుర్మార్గుడు - ప్రాణ స్నేహితుడి కుటుంబాన్నే బలిగొన్న హంతకుడు
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 5:25 PM IST

Updated : Dec 19, 2023, 7:00 PM IST

ఆస్తి కోసం ఆరుగురి వరుస హత్యల కేసు - ప్రధాన నిందితుడు సహా ఐదుగురి అరెస్ట్​

Nizamabad Family Murder Case Update : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఆరుగురి హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసును సాంకేతికత(Technology) సాయంతో ఛేదించినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. ఆస్తి కోసం పథకం ప్రకారమే నిందితులు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశారన్నారు. కిరాతకుడి బారి నుంచి ప్రసాద్‌ తల్లి సుశీలను రక్షించామని చెప్పారు. నలుగురి మృతదేహాలు లభించాయని, ప్రసాద్‌, అతడి భార్య మృతదేహాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - తెలంగాణ అయ్యప్ప భక్తులు దుర్మరణం

Six Members Murder in Nizamabad : గత నెల 19న ప్రసాద్‌ను మాక్లూర్ మండలం మదనపల్లి(madanapalle) వద్ద అటవీ ప్రాంతంలో రాళ్లు, కర్రలతో కొట్టి చంపి, పూడ్చి పెట్టినట్లు ప్రశాంత్‌ ఒప్పుకున్నాడని ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. ఈ కేసులో ప్రశాంత్‌తో పాటు వంశీ, విష్ణు సహా ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రసాద్‌ను చంపేశాక మిగతా కుటుంబ సభ్యుల్ని నమ్మించి వేర్వేరుగా, వేర్వేరు ప్రాంతాల్లో చంపేశాడని తెలిపారు. ప్రసాద్‌ భార్య, చెల్లెలు, పిల్లల్ని గొంతు నులిమి చంపి, ఆ తర్వాత శవాలను పడేశారని వివరించారు.

''నిందితుడు ప్రశాంత్ డిసెంబర్ 1న ప్రసాద్ భార్య శాన్విక, చెల్లెలు శ్రావణిని నిజామాబాద్ తీసుకెళ్లాడు. శాన్వికను భర్త ప్రసాద్​ దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి బాసర తీసుకెళ్లాడు. అక్కడే బాసర(Basara) వంతెన వద్ద తాడుతో ఆమె గొంతును బిగించి చంపాడు. వెంటనే నిందితుడు మృతదేహాన్ని గోదావరిలో పడేశాడు. ప్రసాద్ దగ్గరికి వెళ్దామని చెప్పి శ్రావణిని సైతం తీసుకెళ్లి మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద చంపి తగులబెట్టారు" - సింధూ శర్మ, కామారెడ్డి జిల్లా ఎస్పీ

Man Murdered his Friend Family in Nizamabad : మృతుడి తల్లి, పిల్లలు, మరో చెల్లెలిని కూడా ప్రసాద్ దగ్గరికి వెళ్దామని చెప్పి నిందితుడు ప్రశాంత్ వారిని నిజామాబాద్​లోని లాడ్జిలో ఉంచాడని ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. ప్రసాద్ తన పిల్లల్ని చూడాలని అడిగాడని నిందితుడు చెప్పి, పిల్లలను తన మైనర్(Minor) తమ్ముడితో కలిసి చంపాడని చెప్పారు. అనంతరం మెండోరా వద్ద సోన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేశారని పేర్కొన్నారు. ఈ నెల 13న ప్రసాద్ మరో చెల్లెలు స్వప్నను సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద గొంతు నులిమి చంపి, పెట్రోల్ పోసి తగుల బెట్టారని వివరించారు.

Nizamabad Family Murder Update : కుటుంబ సభ్యులు ఎవ్వరూ తిరిగి రాకపోగా, అనుమానంతో ప్రసాద్​ తల్లి సుశీల లాడ్జి నుంచి తప్పించుకుని పారిపోయిందని ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. సుశీల కోసం కామారెడ్డి జిల్లా (kamareddy) పాల్వంచకు వస్తుండగా నిందితులు ప్రశాంత్, వంశీ, విష్ణు, మైనర్ బాలుడ్ని కామారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

Nizamabad Murder Tragedy : హత్యకు గురైన ప్రసాద్ కుటుంబం సెల్ ఫోన్లు నిందితుడి వద్ద లభించాయని, ప్రసాద్ తల్లిని కూడా చంపాలని ప్రశాంత్ భావించాడని ఎస్పీ సింధూ శర్మ పేర్కొన్నారు.

నాగర్​కర్నూల్​లో నరహంతకుడు - మాయమాటలు చెప్పి 11 మందిని హతం

షాద్ నగర్​లో దారుణం - యువతిపై కత్తితో దాడి

Last Updated : Dec 19, 2023, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.