బిహార్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. తనకు మద్దతు ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు సీఎం.
"రాష్ట్రంలో మెజారిటీ కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు చేస్తున్నాను. నాకు మద్దతిచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను."
- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
రాష్ట్రంలో 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 125 సీట్లను దక్కించుకుంది. ఫలితంగా కూటమి తరఫున మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నారు నితీశ్. ఈ ఎన్నికల్లో మహాకూటమి 110 సీట్లతో సరిపెట్టుకుంది.
ఇదీ చదవండి: 'అనుమానమే లేదు.. నితీశ్దే మళ్లీ సీఎం పీఠం'