ETV Bharat / bharat

'థర్డ్​ ఫ్రంట్​ లేదు.. కాంగ్రెస్​తో కలిసి ఒకటే కూటమి'.. తేల్చేసిన నీతీశ్ - భాజపాపై తేజస్వీ యాదవ్ కామెంట్లు

దేశంలో ఉన్న కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం థర్డ్ ఫ్రంట్ లేదని.. కాంగ్రెస్​తో కలిసి ఒకటే కూటమిగా ఏర్పడితే 2024 ఎన్నికల్లో భాజపా ఘోరంగా ఓడిపోతుందని నీతీశ్ అన్నారు.

nitish kumar on bjp
నీతీశ్ కుమార్
author img

By

Published : Sep 25, 2022, 5:18 PM IST

Updated : Sep 25, 2022, 7:37 PM IST

కాంగ్రెస్‌, లెఫ్ట్ సహా అన్ని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావాలని జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కోరారు. అలా ప్రతిపక్షాలన్నీ ఏకమైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. తాను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిని కానని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ అనే ప్రశ్నే లేదని.. కాంగ్రెస్​తో సహా ఒక ఫ్రంట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పార్టీలు లేకుండా కూటమిని ఊహించలేమని నీతీశ్ అన్నారు. మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతిని పురస్కరించుకుని హరియాణాలోని ఫతేహాబాద్​లో ఐఎన్​ఎల్​డీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఇతర విపక్ష నేతలతో కలిసి పాల్గొన్న నీతీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ర్యాలీని భాజపాయేతర పార్టీల మధ్య ఐక్యతకు తొలి అడుగుగా అభివర్ణించారు నీతీశ్ కుమార్​. ప్రస్తుతానికి అన్ని ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన ఫ్రంట్ అవసరమని.. థర్డ్ ఫ్రంట్ కాదని అభిప్రాయపడ్డారు. బిహార్‌లో ఏడు పార్టీలు కలిసి ఉన్నాయని.. భాజపా ఒంటరిగా ఉందని అన్నారు. 2025 బిహార్ శాసనసభ ఎన్నికల్లో భాజపా గెలవదని జోస్యం చెప్పారు నితీశ్.

" భాజపాయేతర పార్టీలన్నీ ఏకమైతే భాజపాను ఓడించవచ్చు. రాజకీయంగా లబ్ది పొందేందుకే భాజపా హిందూ-ముస్లింల మధ్య వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. అసలు ఈ రెండు వర్గాలు మధ్య విభేదాలు లేవు. 1947లో దేశ విభజన అనంతరం ఎక్కువ సంఖ్యలో ముస్లింలు భారత్​లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు."

-- నీతీశ్ కుమార్, బిహార్ సీఎం

ఐఎన్​ఎల్​డీ నిర్వహించిన ఈ ర్యాలీలో నీతీశ్ సహా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శిరోమణి అకాళీదళ్​ నేత సుఖ్​బీర్ సింగ్ బాదల్, బిహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, శివసేన నేత అరవింద్ సావంత్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ తరపున ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.

2024లో కొత్త ప్రభుత్వం రావాలి..
2024లో ప్రభుత్వ మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. రైతు ఉద్యమ సమయంలో.. కర్షక నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు. రైతులు, యువకుల ఆత్మహత్యలు పరిష్కారం కాదని.. 2024లో కేంద్రంలోని ప్రభుత్వం మారేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పవార్ పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే..
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జేడీయూ, శిరోమణి అకాళీదళ్, శివసేన.. ఎన్​డీఏ నుంచి వైదొలిగాయని బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు. భాజపా తప్పుడు వాగ్దానాలు చేస్తోందని ఆరోపించారు. బిహార్ ప్రభుత్వం యువకులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించగా.. కేంద్రంలోని భాజపా సర్కారు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు. మరోవైపు కొత్త కూటమి ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాల్సిన సమయం వచ్చిందని శిరోమణి అకాళీదళ్ నేత సుఖ్​బీర్​సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు.

సోనియాతో భేటీ..
మరోవైపు.. నీతీశ్‌కుమార్‌, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో కలిసి.. దిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. బిహార్‌లో భాజపాతో తెగదెంపుల తర్వాత తొలిసారి సోనియాతో సమావేశమైన నీతీశ్‌.. విపక్షాలను ఒకే కూటమి కిందకు తీసుకొచ్చే దిశగా చర్చలు జరిపారు. ప్రాంతీయ పార్టీలతో విభేదాలను పక్కనపెట్టి, ఐక్యంగా ముందుకు నడవాల్సిన ఆవశ్యకతను వివరించారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల తర్వాత మరోసారి చర్చలు జరుపుదామని సోనియా చెప్పినట్లు సమావేశం తర్వాత వారు వెల్లడించారు.

ఇవీ చదవండి: భాజపాకన్నా 2 రెట్లు ఎక్కువ ఖర్చు.. ఫలితం శూన్యం.. పీకే స్కెచ్​తో దీదీకి బిగ్ లాస్!

14 గంటల్లో 35 కి.మీ దూరం ఈత..14 ఏళ్ల బాలుడి అరుదైన రికార్డు

Last Updated : Sep 25, 2022, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.