పర్యావరణానికి మేలు చేసే పెయింట్లు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆవుపేడతో తయారై త్వరలో మార్కెట్లోకి రానున్న 'వేదిక్ పెయింట్స్'ను ట్విట్టర్ ద్వారా పరిచయం చేశారు. దీనిని ఖాదీ, గ్రామీణ పరిశ్రమ కమిషన్ ఆధ్వర్యంలో తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో పాడి రైతులకు పరోక్షంగా 55వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు.
-
ग्रामीण इकोनॉमी को बल मिले और किसानों को अतिरिक्त आमदनी हो इसलिए Khadi and Village Industries Commission के माध्यम से हम जल्द ही गाय के गोबर से बना ‘वैदिक पेन्ट' लॅान्च करने वाले हैं। @ChairmanKvic pic.twitter.com/zhQpa3Es5i
— Nitin Gadkari (@nitin_gadkari) December 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ग्रामीण इकोनॉमी को बल मिले और किसानों को अतिरिक्त आमदनी हो इसलिए Khadi and Village Industries Commission के माध्यम से हम जल्द ही गाय के गोबर से बना ‘वैदिक पेन्ट' लॅान्च करने वाले हैं। @ChairmanKvic pic.twitter.com/zhQpa3Es5i
— Nitin Gadkari (@nitin_gadkari) December 17, 2020ग्रामीण इकोनॉमी को बल मिले और किसानों को अतिरिक्त आमदनी हो इसलिए Khadi and Village Industries Commission के माध्यम से हम जल्द ही गाय के गोबर से बना ‘वैदिक पेन्ट' लॅान्च करने वाले हैं। @ChairmanKvic pic.twitter.com/zhQpa3Es5i
— Nitin Gadkari (@nitin_gadkari) December 17, 2020
ఆవుపేడతో రైతుల ఆదాయాన్ని పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. గోవు ఉత్పత్తులను రైతులు సొమ్ముచేసుకునేలా భిన్నమైన ఆలోచనలను ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఆవుపేడతో వివిధ ఉత్పత్తులు తయారుచేస్తుండగా వేదిక్ పెయింట్స్ ఆలోచన మరింత మంది రైతులకు లాభదాయకంగా ఉంటుంది.
- నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి
పర్యావరణహితంగా ఉండే ఈ పెయింట్స్ గోడలకు వేసిన నాలుగు గంటల్లోనే ఆరిపోతాయని గడ్కరీ వివరించారు. బ్యాక్టీరియా, ఫంగస్‌లతో సహా వర్షాన్ని సైతం తట్టుకునేలా తయారు చేశారని తెలిపారు.
ఇదీ చూడండి: నన్ను మాట్లాడనివ్వలేదు: స్పీకర్‌కు రాహుల్ లేఖ