Nitin Gadkari Covid 19: కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఆయన.. తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
"ఈరోజు (మంగళవారం) చేసిన పరీక్షల్లో నాకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలున్నాయి. తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాను. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. నన్ను ఇటీవలే కలిసినవారు.. ఐసోలేషన్‌కు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా." అని గడ్కరీ ట్వీట్ చేశారు. గతేడాది సెప్టెంబర్‌లోనూ ఆయన కొవిడ్ బారినపడ్డారు.
కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు కొవిడ్ బారినపడుతున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఇటీవలే కొవిడ్ నిర్ధరణ అయిన ప్రముఖుల్లో ఉన్నారు.
ఇదీ చూడండి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు కరోనా.. ఇద్దరు సీఎంలకు కూడా..