ETV Bharat / bharat

వరదలతో ఏడాదికి సగటున ఎంత నష్టమో తెలుసా?

భారత్​లో వరదల కారణంగా ఏటా సగటున రూ.5,694 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు నీతి ఆయోగ్‌ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. 12 లక్షల గృహాలు వరదల్లో చిక్కుకుపోతున్నట్లు తెలిపింది. ఏటా 7.17 మిలియన్‌ హెక్టార్ల ప్రాంతం వరద ప్రభావానికి గురవుతోన్నట్లు పేర్కొంది.

NITI Aayog report on loss with floods
వరదలతో విధ్వంసం.. విషాదం..
author img

By

Published : Mar 6, 2021, 6:56 AM IST

దేశంలో వరదల కారణంగా ప్రతి ఏడాదికి సగటున రూ.5,694 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు నీతి ఆయోగ్‌ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏటా 7.17 మిలియన్‌ హెక్టార్ల ప్రాంతం వరద ప్రభావానికి గురవుతోంది. అందులో 3.94 మిలియన్‌ హెక్టార్లు పంట పొలాలున్నట్లు పేర్కొంది. 12 లక్షల గృహాలు వరదల్లో చిక్కుకుపోతున్నట్లు తెలిపింది. వీటన్నింటి కారణంగా 1953 నుంచి 2018 వరకు ఏటా సగటున రూ.5,694 కోట్ల ఆర్థిక నష్టం చోటుచేసుకుంటున్నట్లు వెల్లడించింది. దేశంలో వరదలు, నదుల నిర్వహణపై నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని 16 మంది సభ్యుల బృందం అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. విపత్తు నివారణకు గాను 2021-26 మధ్య తీసుకోవాల్సిన చర్యలను సూచించింది.

"వరద సమస్యను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చర్యలు చేపట్టాలి. వరదను ముందుగా అంచనా వేయడం, ఏ ప్రాంతంలో దాని తాకిడి ఉంటుందో గుర్తించి ఆ ప్రాంతాన్ని తాకకుండా చేయడంలాంటి పనులు చేపట్టాలి. చెరువులు, చెక్‌డ్యామ్‌లు నిర్మించి నదులపై నీటి ఒత్తిడిని తగ్గించాలి. రైల్వేలైన్లు, జాతీయరహదారులు, విలువైన వస్తువులు, అంతర్జాతీయ సరిహద్దులను వరదల నుంచి రక్షించడానికి కరకట్టల నిర్మాణం చేపట్టాలి. నదీ పరివాహక ప్రాంతంపై పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాతే కరకట్టల నిర్మాణాన్ని మొదలుపెట్టాలి. ముందస్తు హెచ్చరికలు జారీచేయడానికి వీలుగా కృత్రిమ మేథ, శాటిలైట్లు, రిమోట్‌సెన్సింగ్‌, జీఐఎస్‌ను విస్తృతంగా ఉపయోగించాలి."

- నీతి ఆయోగ్‌

వరదల నియంత్రణకు చేసిన కొన్ని సిఫార్సులు..

  • అన్ని రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలకు ప్రామాణిక నిర్వహణ విధానాలను నిర్ణయించాలి. నీటి విడుదల గురించి దిగువ ప్రాంతాల్లో వారికి చాలా ముందుగానే తెలియజేయాలి. దిగువ ప్రాంతాల్లో కాలువల ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగించాలి.
  • పట్టణ ప్రాంతాల్లో వరదల నివారణ కోసం ప్రతి నగరానికి ప్రత్యేక వరద నియంత్రణ ప్రణాళికలు రూపొందించుకోవాలి. దాన్ని సిటీ మాస్టర్‌ప్లాన్‌తో అనుసంధానించి, దాని ప్రకారం భూ వినియోగానికి అనుమతులు ఇవ్వాలి.
  • వరదల నియంత్రణకు దీర్ఘకాల పరిష్కారం రిజర్వాయర్ల నిర్మాణమే.
  • ఆంధ్రప్రదేశ్‌తో సహా చాలా వరద ప్రభావిత రాష్ట్రాల్లో సహజ, కృత్రిమమైన వరద కాలువలు లేకపోవడంవల్ల భూ ఉపరితలంపై చేరే నీరు బయటికెళ్లడానికి తగిన మార్గం లభించడంలేదు. దానివల్ల ముంపు తలెత్తి నష్టం సంభవిస్తోంది. అందువల్ల కొత్త కాలువల నిర్మాణం, ఉన్న వాటిని మెరుగుపరచడం ద్వారా ఇలాంటి ముంపును నివారించవచ్చు.
  • ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో వరద ప్రమాద తీవ్రతను చెప్పే అట్లాస్‌లను తయారు చేయాలి.
  • 2016లో ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన సుదీర్ఘ వర్షాల వల్ల 15మంది చనిపోయారు. 25వేల మంది నష్టపోయారు. 50వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.