NIT Recruitment : ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. అసోంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ (నిట్స్)లో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తరువాత హార్డ్‌కాపీలను నిట్ సిల్చార్కు పంపించాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఖాళీల వివరాలు
- ప్రొఫెసర్ (లెవల్ - 14ఏ)
- అసోసియేట్ ప్రొఫెసర్ (లెవల్ - 13ఏ2)
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 1) (లెవల్ - 12)
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 2) (లెవల్ - 11)
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 2) (లెవల్ - 10)
ఈ నోటిఫికేషన్ ద్వారా నిట్ సిల్చార్‌లో మొత్తం 68 ఇంజినీర్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
డిపార్ట్మెంట్స్ - అభ్యర్థులు ఆయా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్లో పనిచేయాల్సి ఉంటుంది.
- డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్
- డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
- డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్
- డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ ఇంజినీరింగ్
- డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్
- డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్
- డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్
- డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్
- డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ
- డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్
- డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమానిటీస్ & సోషల్ సైన్సెస్
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
- జనరల్ కేటగిరీ - 21 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 06 పోస్టులు
- ఓబీసీ - 22 పోస్టులు
- ఎస్సీ - 11 పోస్టులు
- ఎస్టీ - 08 పోస్టులు
విద్యార్హతలు ఏమిటి?
ఆయా పోస్టులకు సంబంధించి ఇంజినీరింగ్ విద్యార్హతలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
అభ్యర్థుల వయోపరిమితి - సడలింపు వివరాలు
ఆయా పోస్టులను అనుసరించి వయోపరిమితి ఉంటుంది. అలాగే అభ్యర్థుల కేటగిరీ ప్రకారం రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.
దరఖాస్తు రుసుము ఎంత చెల్లించాలి?
ఆసక్తి గల అభ్యర్థులు రూ.1,100 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం
ఆసక్తి గల అభ్యర్థులు కచ్చితంగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఎలా చేయాలంటే..
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ nits.ac.inను ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజ్‌లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2023పై క్లిక్ చేయాలి.
- తరువాత దరఖాస్తు ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.
- ఆన్లైన్లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
- అభ్యర్థులు విద్యార్హత పత్రాలతోపాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తును సబ్మిట్ చేసిన తరువాత, దాని హార్డ్ కాపీని ప్రింట్అవుట్ తీసుకోవాలి.
నోట్ : అభ్యర్థులు అప్లికేషన్ హార్డ్ కాపీని డీన్ (ఎఫ్డబ్ల్యూ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్, పీ.ఓ.కు జులై 7వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది.