ETV Bharat / bharat

Nipah Virus Kerala : మరో ఇద్దరికి నిఫా వైరస్..  ప్రభుత్వం అలర్ట్​.. మళ్లీ ఆంక్షలు - నిఫా వైరస్ కేరళ

Nipah Virus Kerala : నిఫా వైరస్​ను కట్టడి చేసేందుకు కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు కంటైన్​మెంట్​ జోన్​లను ఏర్పాటు చేసింది. అలాగే కోజీకోడ్ మెడికల్ ఆస్పత్రిలో 75 ఐసోలేషన్ గదులను సిద్ధం చేసినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

Nipah Virus Kerala
Nipah Virus Kerala
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 11:04 AM IST

Updated : Sep 13, 2023, 11:56 AM IST

Nipah Virus Kerala : కేరళలో నిఫా వైరస్ వేగంగా​ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కోజీకోడ్​లో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. మంగళవారం మరో ఇద్దరికి నిఫా వైరస్ నిర్ధరణ కావడం వల్ల పొరుగు జిల్లాలైన​ కన్నూర్​, వయనాడ్​​, మలప్పురం జిల్లాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. కోజీకోడ్​ మెడికల్ కాలేజీలో 75 ఐసోలేషన్​ గదులను సిద్ధం చేసినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

కోజీకోడ్​ జిల్లాలో ఏడు గ్రామపంచాయతీలను కంటైన్​మెంట్​ జోన్​లుగా ప్రకటించినట్లు వీణా జార్జ్ అసెంబ్లీలో చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 16 కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరోగ్య శాఖ బృందం మంగళవారం రాత్రి.. కోజీకోడ్​లో సమీక్ష నిర్వహించిందని పేర్కొన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్​ఐవీ) బృందాలు బుధవారం కేరళకు చేరుకుంటామని అన్నారు. కేరళలో నిఫా వైరస్​లో కనిపించే వేరియంట్​.. బంగ్లాదేశ్ వేరియంట్​ అని వీణా జార్జ్ పేర్కొన్నారు.

'కేరళలో కనిపించే నిఫా వైరస్ జాతి బంగ్లాదేశ్ వేరియంట్. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. మరణాల రేటు తక్కువగా ఉంది. ఈ వేరియంట్ వ్యాప్తి కూడా తక్కువగానే ఉంది. కంటైన్​మెంట్ జోన్​లను గుర్తించడం, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ గదుల ఏర్పాట్లు వంటి చర్యలు తీసుకుంటున్నాం.' అని వీణా జార్జ్ తెలిపారు.

  • Nipah virus | Kerala Health Minister Veena George says, "On the night of the day before itself, the Health Department held a high-level meeting and all higher officials went to Kozhikode. On the basis of the protocols, 16 committees have been formed...75 rooms have been prepared… pic.twitter.com/gwMN325m1y

    — ANI (@ANI) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కంటైన్​మెంట్ జోన్లు..
మరోవైపు.. కోజికోడ్ పరిధిలోని ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటిస్తూ ఆ జిల్లా కలెక్టర్ గీత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ఆమె కోరారు. కంటైన్‌మెంట్ జోన్‌లలో మాస్క్‌లు, శానిటైజర్లు వాడాలని ప్రజలకు సూచించారు.

"అటాన్‌చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామపంచాయతీలను కంటైన్​మెంట్ జోన్​లుగా ప్రకటిస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కంటైన్​మెంట్ జోన్​ పరిధిలోని ప్రజలు బయటకు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తారు. నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నాం. మెడికల్ షాపులు 24 గంటలు తెరుచుకోవచ్చు. బ్యాంకులు, విద్యాసంస్థలు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. కంటైన్‌మెంట్ జోన్ల గుండా జాతీయ రహదారులపై తిరిగే బస్సులు లేదా వాహనాలు ప్రభావిత ప్రాంతాల్లో ఆగకూడదు."

-- గీత,కోజీకోడ్ కలెక్టర్

కోజీకోడ్‌లో ఇటీవల రెండు అసహజ మరణాలు సంభవించాయి. జ్వర సంబంధిత లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ.. ఆగస్టు 30న ఒకరు, సెప్టెంబరు 11న ఇంకొకరు మరణించారు. నిఫా వైరస్‌ అనుమానంతో బాధితుల నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. తాజాగా వారు 'నిఫా'తోనే మృతి చెందినట్లు నిర్ధరణ అయ్యింది. మరో ఇద్దరికి వ్యాధి నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. వారికి నిఫా వైరస్ సోకినట్లు మంగళవారం తేలింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Nipah Virus Kerala : మళ్లీ 'నిపా' వైరస్​ కలకలం.. ఇద్దరు మృతి.. కేరళకు నిపుణుల బృందం

టీకా లేని 'నిఫా'... సోకితే అంతే సుమా!

Last Updated : Sep 13, 2023, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.