ETV Bharat / bharat

నేడు రైతు సంఘాలతో కేంద్రం 9వ విడత చర్చలు - farmers protest delhi

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం చర్చలు జరపనుంది. విజ్ఞాన్ భవన్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు తొమ్మిదో విడత చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదురుతుందన్న ఆశలు తమకు లేవన్న రైతు సంఘాల నేతలు.. కేంద్రం అన్నదాతల మనోభావాలతో ఆటలాడుతోందని ఆరోపించారు. చట్టాలను రద్దుచేసేంతవరకూ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. జనవరి 26న అమర్ జవాన్ జ్యోతి వద్ద చరిత్రాత్మక దృశ్యం కళ్లకు కడుతుందన్నారు.

ninth round of talks to be held between farmers and center
నేడు రైతు సంఘాలతో కేంద్రం 9వ విడత చర్చలు
author img

By

Published : Jan 15, 2021, 5:00 AM IST

సాగుచట్టాల రద్దును డిమాండ్ చేస్తూ దిల్లీ సరిహద్దుల్లో పోరుబాట సాగిస్తున్న అన్నదాతలతో కేంద్రం శుక్రవారం తొమ్మిదో విడత చర్చలు జరపనుంది. విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ భేటీయే చివరి సమావేశం కావచ్చన్న వార్తల నేపథ్యంలో చర్చలకు హాజరయ్యేందుకు రైతు సంఘాలు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే వ్యవసాయ చట్టాల రద్దు తప్ప తమకు మరేదీ సమ్మతం కాదని తేల్చిచెప్పాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈసారి భేటీలో కేంద్రంతో ఏకాభిప్రాయం కుదురుతుందన్న ఆశలు లేవని కిసాన్ నేతలు అభిప్రాయపడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించే ఉద్దేశం కేంద్రానికి లేదని ఆరోపిస్తున్నారు. తమకు ఎలాంటి కమిటీలు అవసరం లేదని సాగు చట్టాల రద్దు, తమ పంటలకు కనీసమద్దతు ధరనే తాము కోరుతున్నట్లు స్పష్టం చేశారు.

న్యాయస్థానాలు చట్టాలను రద్దు చేయలేవని తెలిసినప్పటికీ కేంద్రం రైతుల మనోభావాలతో ఆటలాడుతోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. సుప్రీం నియమించిన కమిటీలో నుంచి వైదొలగిన భూపీందర్ సింగ్ మాన్ నిర్ణయాన్ని స్వాగతించారు. కమిటీలోని ఇతర సభ్యులు ఆయనను అనుసరించాలన్నారు. డిమాండ్లను నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. జనవరి 26న అమర్ జవాన్ జ్యోతి వద్ద చరిత్రాత్మక దృశ్యం కళ్లకు కడుతుందని చెప్పారు.

రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ ఊరేగింపు వెళ్తాం. అమర్ జవాన్ జ్యోతి వద్ద జెండాను ఎగరవేస్తాం. ఒక వైపు రైతులు... మరోవైపు జవాన్లు. ఇది ఒక చరిత్రాత్మక దృశ్యం అవుతుంది.

-రాకేశ్ టికైత్​, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి.

సానుకూలం కావచ్చు..

మరోవైపు ఈ సమావేశంలో చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆశాభావం వ్యక్తంచేశారు. రైతు సంఘాలతో పారదర్శకంగా చర్చలు జరుపుతామని తెలిపారు.

వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఈనెల 19న సమావేశం కానుంది. దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలో భేటీకానున్నట్లు కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వాట్​ వెల్లడించారు. చర్చల కోసం రైతుల దగ్గరికి వెళ్లేందుకు సిద్ధమన్న ఆయన... ఆ విషయంలో ఎలాంటి పట్టింపులు లేవన్నారు.

ఇదీ చూడండి: 'అతిథి లేకుండానే ఈసారి గణతంత్ర వేడుకలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.