ఓ మహిళ, ఆమె కూతురుపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో 9 మందికి జీవితఖైదు విధించింది బిహార్లోని గయా జిల్లా కోర్టు. ఒక్కో నిందితుడిపై రూ.15,000 జరిమానా విధిస్తున్నట్లు ఇచ్చిన తీర్పులో పేర్కొంది.
ఇదీ జరిగింది..
కొంచ్ ఠాణా పరిధిలోని సొందిహా గ్రామంలో.. ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి అతని భార్య, కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన 2018 జూన్ 13న జరగ్గా.. అప్పట్లో రాష్ట్రంలో సంచలన ఘటనగా నిలిచింది.
ఇదీ చదవండి:భాజపా ఎంపీ ఇంటి వద్ద బాంబు దాడి - ముగ్గురికి గాయాలు