ETV Bharat / bharat

'భారత్​-చైనా చర్చల్లో ఆశించిన పురోగతి లేదు' - భారత్​ చైనా ఉద్రిక్తతలు

తూర్పు లద్దాఖ్​లో నెలొకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారత్​-చైనాల మధ్య ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని విదేశాంగ మంత్రి జై శంకర్​ తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది రౌండ్​ల చర్చలు జరిగాయని.. రానున్న కాలంలోనూ కొనసాగుతాయని చెప్పారు.

External Affairs Minister S Jaishankar
'భారత్​, చైనాల చర్చల్లో ఆశించిన పురోగతి లేదు'
author img

By

Published : Feb 6, 2021, 2:47 PM IST

తూర్పు లద్ధాఖ్‌లో బలగాల ఉపసంహరణపై.. భారత్‌, చైనా మధ్య చర్చల్లో ఆశించిన పురోగతి లేదని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్‌ చెప్పారు. ఇరు దేశాల మధ్య తొమ్మిది దఫాల కమాండర్ల స్థాయి చర్చలు జరిగాయని.. ఈ చర్చలు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని పేర్కొన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడిన జై శంకర్‌ ఈ వివరాలు తెలిపారు.

ఈ అంశంపై ఇరు దేశాల మధ్య మంత్రుల స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందించిన జై శంకర్​.. సైనిక వర్గాలకే దీనిపై అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో జరిగే విషయాలపై అవగాహన ఉండాలన్న మంత్రి.. ఇది క్లిష్టమైన సమస్య అని తెలిపారు.

ఇదీ చదవండి: 'దేశ హితం కోసం వారు సత్యాగ్రహం చేస్తున్నారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.