ETV Bharat / bharat

ఆ హైకోర్టులకు 9 మంది జడ్జిల నియామకం - nv ramana news

సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు.. దేశంలోని వివిధ హైకోర్టులకు జడ్జిలను (High court judges) నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొత్తం 9 మందిని ఐదు హైకోర్టులకు ఎంపిక చేసింది.

author img

By

Published : Oct 6, 2021, 7:07 PM IST

దేశంలోని వివిధ హైకోర్టుల్లో జడ్జిల(High court judges) నియామక ప్రక్రియను వేగవంతం చేసింది సుప్రీం కోర్టు. ఈ సెప్టెంబర్​ 30న మొత్తం 16 మంది అడ్వొకేట్లు, జుడీషియల్​ అధికారులకు పదోన్నతి కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ మేరకు తాజాగా 9 మందిని ఆయా హైకోర్టులకు పంపిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇందులో ఏడుగురు జుడీషియల్​ అధికారులు, ఇద్దరు అడ్వొకేట్లు ఉన్నారు. వీరిని 5 హైకోర్టులకు జడ్జిలుగా నియమిస్తున్నట్లు.. సంబంధిత వివరాలను న్యాయ మంత్రిత్వ శాఖ ట్వీట్​ చేసింది.

నలుగురిని ఝార్ఖండ్​ హైకోర్టుకు(High court judges), ఇద్దరిని పట్నా హైకోర్టుకు ఎంపిక చేసింది కేంద్రం. మిగతా ముగ్గురు ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, కేరళ హైకోర్టులకు నియమితులయ్యారు.

జస్టిస్​ రమణ వచ్చిన తర్వాత..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్​వీ రమణ (nv ramana news) ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఆయన నేతృత్వంలోని కొలీజియం.. ఖాళీల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులు సహా దేశంలోని వివిధ హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి వంద మంది పేర్లను సిఫార్సు చేసింది.

ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9 మంది జడ్జిలు(Supreme Court Judges) ప్రమాణస్వీకారం చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఇంతమంది జడ్జిలు ఒకేసారి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండటం విశేషం. జస్టిస్ ఎన్​వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు.

2021 మే 1 నాటికి దేశంలోని హైకోర్టులకు 1,080 మంది న్యాయమూర్తులను కేటాయించగా, ప్రస్తుతం అవి 420 మందితో మాత్రమే పని చేస్తున్నాయి.

ఇవీ చూడండి: 'న్యాయవ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ అవసరం'

'నేతలతో కుమ్మక్కైన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.