కల్తీ సారా కేసులో.. బిహార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016లో తీవ్ర కలకలం సృష్టించిన ఓ కల్తీసారా కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధించింది. ఇదే వ్యవహారంలో దోషులుగా తేలిన నలుగురు మహిళలకు జీవిత ఖైదు విధించింది.
2016లో గోపాల్‌గంజ్‌లో కల్తీ సారా తాగిన ఘటనలో 21మంది మరణించగా.. అనేకమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. ఈ విషాదానికి బాధ్యులైన వారికి శిక్షలు ఖరారు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: యూపీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం