NIACL AO Recruitment 2023 : ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (స్కేల్-1) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- రిస్క్ ఇంజినీర్స్ - 36
- ఆటోమొబైల్ ఇంజినీర్స్ - 96
- లీగల్ - 70
- అకౌంట్స్ - 30
- హెల్త్ - 75
- ఐటీ - 23
- Generalists - 120
విద్యార్హతలు
NIACL AO Eligibility :
- ఇంజినీరింగ్ జాబ్స్ విషయంలో ఆయా పోస్టులను అనుసరించి బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలకు.. లా గ్రాడ్యుయేషన్ లేదా లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
- అకౌంట్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు.. చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) చేసి ఉండాలి.
- హెల్త్ ఏవో పోస్టులకు.. ఎంబీబీఎస్/ఎండీ /ఎంఎస్/పీజీ మెడికల్ డిగ్రీ లేదా బీడీఎస్/ఎండీఎస్/ లేదా బీఏఎంఎస్/ బీహెచ్ఎంఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఐటీ స్పెషలిస్ట్ పోస్టులకు.. బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి.
వయోపరిమితి
NIACL AO Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్-సర్వీస్మెన్, డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము
NIACL AO Application Fee : అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మాత్రం కేవలం రూ.100 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
NIACL AO Selection Process : అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. తరువాతి దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణత సాధించినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
NIACL AO Salary : ఏవో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జీతం రూ.50,925 నుంచి రూ.85,925 వరకు ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీల్లో పనిచేసే వారికి రూ.80,000 వరకు జీతం ఉంటుంది. వీటితోపాటు గ్రాట్యుటీ, ఎల్టీఎస్, మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తారు.
దరఖాస్తు విధానం
NIACL AO Apply Online : ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.newindia.co.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
NIACL AO Application Last Date :
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 ఆగస్టు 1
- దరఖాస్తుకు ఆఖరి తేదీ : 2023 ఆగస్టు 21