జమ్ముకశ్మీర్‌లో(kashmir latest news) పౌరుల వరుస హత్యలపై ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణ చేపట్టనుంది. జమ్ముకశ్మీర్ డీజీపీ.. దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ పంపుతున్నట్లు సమాచారం. హోంశాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఎన్ఐఏ రంగంలోకి దిగనుంది.
ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన మఖన్‌లాల్ బింద్రో, విరేంద్ర పాశ్వాన్‌కు సంబంధించిన కేసులపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అక్టోబర్ 5న.. తన ఫార్మసీ దుకాణంలో మఖన్‌లాల్ పనిచేస్తుండగా.. ముష్కరులు పాయింగ్ బ్లాంక్‌లో కాల్చిచంపారు. భేల్పూరి అమ్ముకునే విరేంద్రను కూడా పాయింట్ బ్లాంక్‌లో కాల్చి హత్య చేశారు(kashmir terror news).
జమ్ముకశ్మీర్ పోలీస్, ఎన్ఐఏ డైరక్టర్ జనరల్స్.. శ్రీనగర్‌లో సమావేశమై కేసుపై చర్చించనున్నట్టు సమాచారం.
పూంచ్‌లో నరవణె..
మరోవైపు.. ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె.. పూంచ్‌లోని ఆపరేషన్ సైట్లను సందర్శించారు. నియంత్రణ రేఖ వెంబడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారు. చోరబాట్లకు వ్యతిరేకంగా సాగుతున్న కార్యకలాపాలను నరవణెకు అధికారులు వివరించారు.
-
General MM Naravane #COAS visited forward areas of #WhiteKnight Corps & undertook a first-hand assessment of the situation along the Line of Control. #COAS was briefed by commanders on the ground about the present situation & ongoing counter-infiltration operations.#IndianArmy pic.twitter.com/2c9uKC04SY
— ADG PI - INDIAN ARMY (@adgpi) October 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">General MM Naravane #COAS visited forward areas of #WhiteKnight Corps & undertook a first-hand assessment of the situation along the Line of Control. #COAS was briefed by commanders on the ground about the present situation & ongoing counter-infiltration operations.#IndianArmy pic.twitter.com/2c9uKC04SY
— ADG PI - INDIAN ARMY (@adgpi) October 19, 2021General MM Naravane #COAS visited forward areas of #WhiteKnight Corps & undertook a first-hand assessment of the situation along the Line of Control. #COAS was briefed by commanders on the ground about the present situation & ongoing counter-infiltration operations.#IndianArmy pic.twitter.com/2c9uKC04SY
— ADG PI - INDIAN ARMY (@adgpi) October 19, 2021
అటు పౌరుల హత్యలు, భద్రతా దళాలు-ముష్కరుల ఎన్కౌంటర్లతో గత కొన్ని రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల దాడుల్లో 11మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా దళాలు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నాయి.
ఇవీ చూడండి:-