ETV Bharat / bharat

మైనారిటీలపై దాడుల కేసులో ఎన్ఐఏ విస్తృత తనిఖీలు - కశ్మీర్ ఎన్ఐఏ

జమ్ము కశ్మీర్​లో మైనారిటీలపై దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. (NIA raids in Kashmir) దిల్లీ, యూపీ, కశ్మీర్​లోని 18 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. మరోవైపు ముంద్రా కేసులో భాగంగా దిల్లీలో తనిఖీలు చేస్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ.

nia raids
ఎన్ఐఏ దాడులు
author img

By

Published : Oct 12, 2021, 11:24 AM IST

జమ్ము కశ్మీర్‌లో మైనారిటీలపై ఉగ్రదాడులకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA news) విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌లోని 18 ప్రదేశాల్లో దాడులు (NIA raids in Kashmir) జరుపుతోంది. లష్కర్ ఏ తోయిబా, జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌, అల్‌బదర్‌ సంస్థలపై దృష్టి సారించిన ఎన్ఐఏ... ఉగ్రవాదసంస్థలకు సంబంధమున్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా గాలిస్తోంది. (NIA raids in J&K)

ఇది రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండో భారీ తనిఖీ ఆపరేషన్ కావడం గమనార్హం. అక్టోబర్ 10న దాదాపు 15 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది.

సీబీఐ సైతం..

మరోవైపు, కేంద్ర దర్యాప్తు బృందం(సీబీఐ) సైతం కశ్మీర్​లో దాడులు (CBI raid today) చేస్తోంది. మొత్తం 40 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టింది. జమ్ము కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్​కు సలహాదారుడిగా పనిచేసిన బసీర్ ఖాన్ అనే వ్యక్తి ఇంటిలో సైతం సోదాలు జరుపుతోంది. ఆయుధాల లైసెన్సింగ్ కేసులో భాగంగా ఈ దాడులు నిర్వహిస్తోంది సీబీఐ. (CBI raid news)

ముంద్రా కేసులో...

అటు.. ముంద్రా పోర్టు డ్రగ్స్‌ (Mundra port drugs) వ్యవహారంలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. దిల్లీలోని ఐదు ప్రదేశాల్లో తనిఖీలు ఎన్‌ఐఏ అధికారులు చేస్తున్నారు. (Mundra port drugs case)

మావోయిస్టుల కోసం మూడు రాష్ట్రాల్లో...

మరోవైపు, మావోయిస్టులతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న వ్యక్తుల కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. కోయంబత్తూరులో మూడు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. (NIA raids in kerala)

tamilnadu nia raids
తమిళనాడులో ఓ ఇంట్లో తనిఖీలు

రెండేళ్ల క్రితం దినేశ్, డానిష్ అనే ఇద్దరు మావోయిస్టు మద్దతుదారులను కోయంబత్తూరులోని పులియాకులం ప్రాంతం నుంచి కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వీరి ఇళ్లలోనే తాజాగా తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. సంతోష్ పొల్లాచి అనే వ్యక్తి ఇంటిని సైతం అధికారులు సోదా చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.