రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ నివాసం అంటిల్లా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసులో ఎన్ఐఏ అధికారులు మరో పోలీసు అధికారిని అరెస్ట్ చేశారు. ముంబయి నేరవిభాగం ఇన్‌స్పెక్టర్ సునీల్ మానేను అదుపులోకి తీసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు పోలీసు అధికారులు అరెస్టయ్యారు. మార్చిన 13న సచిన్ వాజెేను, ఈనెల 12న మరో పోలీసు అధికారి రియాజుద్దీన్ ఖాజీని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసు అధికారులు ఇద్దరు.. సచిన్ వాజేకు సహకరించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి:మహా సర్కారును కుదిపేస్తున్న 'వాజే లేఖ'