గంగానదిలో మృతదేహాలు లభ్యమవడంపై కేంద్రం, ఉత్తర్ప్రదేశ్, బిహార్ ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా సమాధానం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, ఉత్తర్ప్రదేశ్, బిహార్ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.
ఉత్తర్ ప్రదేశ్లోని బలియా జిల్లా గంగానదిలో 52 మృతదేహాలు ఇటీవల తేలియాడుతూ కనిపించాయి. బిహార్లోని గంగానది వద్ద కూడా కొన్ని మృతదేహాలు కనిపించాయి.
ఇదీ చదవండి: గంగానదిలో భారీగా మృతదేహాలు.. ఏం జరిగింది?