ETV Bharat / bharat

వావ్.. న్యూస్​పేపర్స్​తో అందమైన శిల్పాలు.. 'జానకి రామ్​' టాలెంట్​ అదుర్స్​! - ప్రత్యేకమైన శిల్ప కళ ఆలోచనలు

Newspaper Sculpture Art In Maharashtra : శిల్పాలను రాయితో, విగ్రహాలను లోహాలతో తయారు చేయడం మనకు తెలుసు. ఇందుకు భిన్నంగా ఓ కళాకారుడు వినూత్నంగా ఆలోచించి దినపత్రికలతో విగ్రహాలను తయారు చేస్తున్నారు. న్యూస్‌ పేపర్‌ ఉంటే చాలు.. శిల్పం రెడీ చేసేస్తారు. చూడటానికి అవి అచ్చం లోహంతో చేసిన వాటిలాగే ఉంటాయి.

Newspaper Sculpture Art In Maharashtra
Newspaper Sculpture Art In Maharashtra
author img

By

Published : Jul 31, 2023, 7:13 AM IST

కాగిత శిల్పాలతో ఆకట్టుకుంటున్న కళాకారుడు

Newspaper Sculpture Art In Maharashtra : కాదేదీ కళకు అనర్హం. అగ్గిపుల్లా, సబ్బుబిల్లా ఏదైతేనేం. వినూత్న ఆలోచనలు, చేయాలనే తపన ఉండాలే గానీ.. శిలలో శిల్పి శిల్పాన్ని చూసినట్లు.. ప్రతీ వస్తువుతో అద్భుతాలు సృష్టించవచ్చు. అలాగే.. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో కళాకారుడు జానకీరామ్​ అయ్యర్‌ మనం రోజూ చూసే దినపత్రికలతో ముచ్చటైన శిల్పాలను తయారు చేస్తున్నారు.

నాట్య దేవుడైన నటరాజుని విగ్రహం వార్తా పత్రికలతో తయారు చేశారు జానకీరాం. అచ్చం పంచలోహాలతోనో, ఇత్తడితోనో తయారు చేసినట్లుగానే ఇది ఉంటుంది. అయ్యర్‌ దీనిని న్యూస్‌పేపర్‌ అల్లికతో తయారు చేశారు. వార్తా పత్రికలను అల్లడం, వాటిని కత్తిరించడం, మలచడం వంటివి చేస్తూ అయ్యర్‌ వీటిని రూపొందించారు. మొదట్లో కాగితాన్ని అల్లడం ద్వారా విగ్రహాలను తయారు చేసేవారు అయ్యర్‌. క్రమంగా కార్వింగ్‌ చేస్తూ ఈ పని చేయడం మొదలుపెట్టారు.

"మా ఇంట్లో కాగితాలను ముక్కలుగా చేసి ట్రే తయారు చేశాను. తర్వాత చేసిన మౌల్డింగ్‌ గొప్పగా అనిపించింది. మెల్లమెల్లగా పిచ్చుక, ఏనుగు వంటి కొన్ని వస్తువులను తయారు చేయడం ప్రారంభించాను."

-జానకిరామ్​ అయ్యర్, కళాకారుడు

వార్తాపత్రికలను కత్తిరించి వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి ఫెవికాల్‌తో అతికిస్తారు. అలా మందంగా అట్టముక్కలా తయారైన తర్వాత కావాల్సిన ఆకృతిలో కార్వింగ్‌ చేస్తారు. ఒక శిల్పాన్ని రూపొందించడానికి అయ్యర్‌కు 15 రోజులు పడుతుంది. వివిధ పక్షులు, జంతువుల శిల్పాలతో సహా దేవతామూర్తుల విగ్రహాలను ఆయన తయారు చేస్తున్నారు.

RRR సూత్రం.. పాత న్యూస్ పేపర్స్​తో 'ఆమె' అద్భుతాలు..
గతంలో నాగ్​పుర్​కు చెందిన సాధన ఫద్కర్ అనే మహిళ కూడా ఇలాగే వినూత్నంగా ఆలోచించింది. పాత న్యూస్ పేపర్లను పడేయకుండా వాటితో వివిధ రకాల అందమైన బుట్టలను తయారు చేయటం 2014లో ప్రారంభించింది. రీసైకిల్, రీయూజ్​, రెడ్యూస్ అనే ట్రిపుల్ ఆర్ సూత్రంతో.. పాత న్యూస్ పేపర్స్​తో అద్భుతాలు చేసింది సాధన. బుట్టలే కాకుండా, హ్యాండ్‌బ్యాగ్‌లు, కుండీలు, పేపర్ బ్యాగ్‌లు, టేబుల్ ల్యాంప్‌లు వంటి అనేక విభిన్న వస్తువులను తయారు చేసింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.