ETV Bharat / bharat

Newsclick Founder Arrested : పోలీసు కస్టడీకి న్యూస్​క్లిక్ వ్యవస్థాపకుడు.. సంస్థ HR​ సైతం.. - newsclick journalist arrested

Newsclick Founder Arrested : ఆన్‌లైన్‌ వార్తాపోర్టల్​ న్యూస్‌క్లిక్‌ను వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థకు పోలీసు కస్టడీ విధించింది దిల్లీలోని ప్రత్యేక కోర్టు. సంస్థ హెచ్ఆర్​ చీఫ్​ను సైతం కస్టడీకి అప్పగించింది.

Newsclick Founder Arrested
Newsclick News
author img

By PTI

Published : Oct 4, 2023, 12:28 PM IST

Updated : Oct 4, 2023, 1:43 PM IST

Newsclick Founder Arrested : చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం(UAPA) కింద అరెస్టయిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ, HR చీఫ్‌ అమిత్‌ చక్రవర్తిని న్యాయస్థానం 7రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. చైనాకు అనుకూలంగా వార్తా కథనాలు రాసేందుకు నిధులు అందుకున్నారనే ఆరోపణలపై దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు మంగళవారం న్యూస్‌ క్లిక్‌ కార్యాలయంతోపాటు 30 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మంది జర్నలిస్టులను ప్రశ్నించారు. అనంతరం న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌, HR చీఫ్‌ అమిత్‌ చక్రవర్తిని అరెస్ట్‌ చేశారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపర్చగా ఏడురోజుల పోలీసు కస్టడీకి అనుమతించినట్లు అధికారులు తెలిపారు. దిల్లీలో ఉన్న న్యూస్‌క్లిక్‌ కార్యాలయాన్ని సీజ్‌ చేసిన పోలీసులు 46మంది అనుమానితులను ప్రశ్నించటంతోపాటు వారి నుంచి ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, ఇతర దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఆరుగంటలకుపైగా విచారణ..
బుధవారం ఉదయం ప్రారంభమయిన సోదాలు దిల్లీ-NCRలోనూ కొనసాగాయి. ఈ కేసుతో సంబంధమున్న కొందరు పాత్రికేయులు ఊర్మిళేష్, ఔనింద్యో చక్రవర్తి, అభిసార్ శర్మ, పరంజోయ్ గుహా ఠాకుర్తాతో పాటు చరిత్రకారుడు సోహైల్ హష్మీ, వ్యంగ్య రచయిత సంజయ్ రాజౌరా, సెంటర్ ఫర్ టెక్నాలజీ & డెవలప్‌మెంట్‌కు చెందిన డి రఘునందన్​ను అధికారులు ప్రశ్నించారు. ఆరు గంటలకుపైగా సాగిన ఈ విచారణ అనంతరం వారిని వెళ్లేందుకు అనుమతించారు.

'ఈ దాడులు అందుకే..' : కాంగ్రెస్​
న్యూస్​క్లిక్​పై దాడులను ప్రతిపక్ష కాంగ్రెస్ ఖండించింది. బిహార్​లో కులగణన ద్వారా బయటపడిన సంచలన నిజాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగుతోందని ఆరోపించింది. దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్​ పెరుగుతోందని.. దీనిని కప్పిపుచ్చేందుకే ఈ రకమైన దాడులు జరుపుతున్నారని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా పేర్కొన్నారు. వార్తా పోర్టల్​పై​ దాడులపై దిల్లీ పోలీసుల తీరును ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్రంగా తప్పుబట్టింది. తాజా పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలతో ఓ ప్రకటనను విడుదల చేస్తామని చెప్పింది.

ఇదీ కారణం..
చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికాకు చెందిన మిలియనీర్‌ నెవిల్‌ రాయ్‌ సింగం అనే వ్యక్తి నుంచి గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్‌ పోర్టల్​ నిధులు పొందినట్లు యూఎస్​కు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక 2023 ఆగస్టు 5న తన కథనంలో ప్రచురించింది. దీంతో ఆగస్టు 17న చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ)- ఉపా చట్టంలోని పలు సెక్షన్ల కింద న్యూస్​క్లిక్​ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థతో పాటు ఈ వ్యవహారంతో సంబంధమున్న మరికొంతమందిపై కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.

Newsclick Office Raid : న్యూస్​క్లిక్​పై కొత్త కేసు.. సంస్థ కార్యాలయంతో పాటు జర్నలిస్టుల ఇళ్లపై దాడులు

Newsclick Journalists Arrested : న్యూస్​క్లిక్​ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్.. ​ఉపా చట్టం కింద కేసు..

Last Updated : Oct 4, 2023, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.