మహారాష్ట్రలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఒక్కరోజే 920మంది వైరస్‌తో చనిపోయారు. మరోవైపు కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 57,640 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 57 వేలమంది వైరస్ నుంచి కోలుకున్నారు.
వైరస్ విలయం
కర్ణాటకలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 50,112 కేసులు నమోదయ్యాయి. 346 మంది చనిపోయారు. మరో 26,841 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు.
ఉగ్రరూపం
కేరళలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజే 41,953 కేసులు నమోదవగా.. 58 మంది కొవిడ్‌కు బలయ్యారు. 23 వేలమందికిపైగా వైరస్‌ను నుంచి కోలుకున్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- తమిళనాడులో మరో 23,310 మందికి వైరస్ సోకగా.. 167 మంది మరణించారు.
- దిల్లీలో తాజాగా 20,960 కేసులు బయటపడ్డాయి. మరో 311 మంది చనిపోయారు.
- బంగాల్లో మరో 18,102 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే కేసుల్లో ఇదే అత్యధికం. ఇవాళ.. 103 మంది కరోనాకు బలయ్యారు.
- రాజస్థాన్‌లో ఒక్కరోజే 16,815 మంది కరోనా బారిన పడ్డారు. మరో 155 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు సంఖ్య 2 లక్షలకు చేరువైంది.
- మధ్యప్రదేశ్‌లో కొత్తగా 12,319 మందికి పాజిటివ్‌గా తేలగా.. 71 మంది చనిపోయారు.
- గుజరాత్లో తాజాగా 12,955 కేసులు వెలుగుచూడగా.. 133 మంది ప్రాణాలు కోల్పోయారు.