Family Planning Kits: కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు ఒడిశా ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. నూతన వధూవరులకు 'నవ దంపతీ కిట్' లేదా 'నాయి పహల్ కిట్' పేరుతో ఓ కిట్‌ను అందించనుంది. అందులో గర్భనిరోధక మాత్రలతో పాటు ఇతర వస్తువులను ఇవ్వనుంది.
కుటుంబ నియంత్రణ ప్రయోజనాల గురించి నవదంపతులకు అవగాహన కల్పించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ సహాయంతో నాయి పహల్ పథకాన్ని ఒడిశా ప్రభుత్వం.. సెప్టెంబర్ నెలలో ప్రారంభించనుంది. ఆ పథకంలో భాగంగా నూతన వధూవరులకు స్పెషల్ కిట్లు ఇవ్వనుంది. ఆ కిట్‌లో వివాహ రిజిస్ట్రేషన్ ఫారమ్, కండోమ్‌లు, అత్యవసర గర్భనిరోధకాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులకు సంబంధించిన ఓ బుక్‌లెట్ ఉంటాయి. వాటితో పాటు ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్, తువ్వాళ్లు, దువ్వెన, నెయిల్ కట్టర్, అద్దం వంటి వస్తువులు కూడా ఉంటాయి.
అయితే ఈ కిట్‌ల పంపిణీ బాధ్యతను సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు అప్పగిస్తామని ఫ్యామిలీ ప్లానింగ్ డైరెక్టర్ డా. బిజయ్ పాణిగ్రాహి తెలిపారు. నూతన వధూవరులకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఆశా కార్యకర్తలకు శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు.
ఇవీ చదవండి: ఆలయాల్లో పూజలు హుండీల్లో చోరీలు అడ్డంగా బుక్కైన ప్రేమజంట