ETV Bharat / bharat

హనీమూన్​కు వెళ్లి డాక్టర్​ దంపతులు మృతి.. పెళ్లైన పది రోజులకే.. - ఏడేళ్ల బాలికపై తండ్రి స్నేహితుడు అత్యాచారం

ఇండోనేషియాలో ఓ భారతీయ నవ జంట ప్రాణాలు కోల్పోయింది. హనీమూన్ వెళ్లిన ఆ దంపతులు.. ఓ బోటు ప్రమాదంలో చనిపోయారు. పెళ్లైన పది రోజులకే భార్యభర్తలు ప్రాణాలు కొల్పోవడం వల్ల.. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.

newly-married-couple-died-in-indonesia-newlyweds-die-in-indonesia-on-honeymoon-trip
ఇండోనేషియాలో నూతన వధూవరులు మృతి
author img

By

Published : Jun 11, 2023, 7:43 AM IST

Updated : Jun 11, 2023, 8:45 AM IST

హనీమూన్​ కోసం ఇండోనేషియా వెళ్లిన ఓ భారతీయ నవ వధూవరులు.. సముద్రంలో పడి చనిపోయారు. పెళ్లైన పది రోజులకే.. ప్రాణాలు కోల్పోయారు. అనుకోకుండా జరిగిన బోటు ప్రమాదంలో.. ఇద్దరూ మృతి చెందారు. ఆనందంగా హనీమూన్​కు వెళ్లిన నూతన దంపతులు.. ఇలా ప్రమాదంలో మృతి చెందడం వల్ల ఇరువురి కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.

తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన లోకేశ్వరన్, విబుష్నియాకు కొత్తగా పెళ్లి జరిగింది. జూన్​ 1నే స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్​ హాల్​లో ఘనంగా వీరి వివాహం జరిగింది. వృత్తి రీత్యా లోకేశ్వరన్, విబుష్నియా వైద్యులు. పెళ్లి అనంతరం నూతన వధూవరులిద్దరు కలిసి.. ఇండోనేషియాకు హనీమూన్​ కోసం వెళ్లారు. జూన్​ 9న ఓ మోటార్​ బోట్​పై సముద్రంలో విహారం చేసేందుకు వెళ్లారు. ఇద్దరు ఫొటోలు తీసుకుంటున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా అదుపు తప్పింది. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. దీంతో లోకేశ్వరన్, విబుష్నియా సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి లోకేశ్వరన్​ మృతదేహాన్ని వెలికితీసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. విబుష్నియా మృతదేహం ఇంకా లభించలేదని.. గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. కాగా లోకేశ్వరన్, విబుష్నియా మృతదేహాలను భారత్​కు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

స్నేహితుడి ఏడేళ్ల​ కుమార్తెపై అత్యాచారం.. 50 రూపాయలు ఆశచూపి..
స్నేహితుడి ఏడేళ్ల​ కుమార్తెపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఆమెకు రూ.50 ఇస్తానని ఆశచూపి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔరంగాబాద్ జిల్లాలోని సిల్లోడ్ ప్రాంతంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని షేక్ మున్వర్​గా పోలీసులు గుర్తించారు. నిందితుడు మొదట 50 రూపాయల ఆశచూపించి.. చిన్నారిని అతడి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడ్డ ఆ చిన్నారి.. అత్యాచారం గురించి ఎవ్వరితో చెప్పలేదు.

కాగా చిన్నారి అనారోగ్యంతో బాధపడటాన్ని గమనించిన ఆమె తల్లి.. కూతురుని గట్టిగా నిలదీసింది. దీంతో విషయం మొత్తాన్ని తల్లికి వివరించింది కూతురు. అనంతరం శనివారం మధ్యాహ్నం నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది చిన్నారి తల్లి. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Jun 11, 2023, 8:45 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.