ETV Bharat / bharat

నవజాత కవలలకు కరోనా పాజిటివ్​ - గుజరాత్​ న్యూస్​ ఆన్​లైన్

గుజరాత్​లోని ఓ ఆసుపత్రిలో నవజాత కవలల్లో కరోనా వెలుగుచూసింది. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 15రోజుల క్రితమే ఈ శిశువులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు.

Newborn twins tests positive for COVID-19 in Vadodara
నవజాత కవలలకు కరోనా పాజిటివ్​
author img

By

Published : Apr 2, 2021, 1:50 PM IST

గుజరాత్​ వడోదరలోని ఎస్ఎస్​జీ ఆసుపత్రిలో జన్మించిన కవలలకు కరోనా నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు పీడియాట్రిక్స్ విభాగం ప్రధాన వైద్యురాలు షీల్ అయ్యర్ తెలిపారు.

15రోజుల క్రితం తీవ్రమైన విరేచనాలతో బాధపడుతోన్న శిశువులకు చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. అప్పుడు కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆసుత్రికి తీసుకొచ్చిన వీరిని పరీక్షించగా కరోనా ఉన్నట్లు తేలిందని వైద్యులు వివరించారు.

శిశువుల తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ రా​గా.. చికిత్స తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఒకే ఊరిలో 170 మందికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.