Baby Declared Dead Found Alive: ఒడిశా కెందుఝర్ జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. డాక్టర్లు చనిపోయిందని నిర్ధరించిన శిశువు.. పూడ్చిపెట్టడానికి ముందు బతికింది.
జిల్లాలోని ఖందికపడ గ్రామంలో రాయ్మణి ముండా, సునియా ముండా నివసిస్తున్నారు. రాయ్మణి బుధవారం పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఆనంతరం ఓ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. కానీ శిశువు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. చేసేదేమీ లేక.. మృత శిశువును ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం పూడ్చి పెట్టడానికి శ్మశానానికి వెళ్లారు. గుంతలో పెట్టడానికి ముందు ఒక్కసారిగా ఏడ్చింది శిశువు. దీంతో చిన్నారిని మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యుల నిర్లక్ష్యంగా బతికున్న శిశువును చనిపోయినట్లు నిర్ధరించారని ఆస్పత్రి వద్ద బాధితుల బంధువులు ఆందోళన చేపట్టారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కనకపు విలాసాలకు వధువు నో.. ఏడు పేద కుటుంబాల్లో జీవితకాలపు వెలుగులు