New Parliament Open Today : భారత స్వాతంత్ర్య ప్రయాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతన పార్లమెంట్‌లో కార్యకలపాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో జరిగిన ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయసభల సభ్యుల కొత్త పార్లమెంట్‌కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా కేంద్రమంత్రులు, ఎన్డీఏ కూటమిలోని మిగతా సభ్యులు ఆయన్ను అనుసరించారు.
'భారత్ మాతాకీ జై' అంటూ కొత్త పార్లమెంట్‌లోకి..
అనంతరం సభ్యులంతా 'భారత్ మాతాకీ జై' అంటూ నినదిస్తూ కొత్త భవనంలోకి అడుగుపెట్టారు. సెంట్రల్ హాల్‌లోని రాజ్యాంగ పుస్తకాన్ని నూతన భవనంలోకి తరలించారు. కాంగ్రెస్ నేతలు భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ రాజ్యాంగాన్ని చేతపట్టగా రాహుల్‌గాంధీ సహా మిగిలిన సభ్యులు నూతన పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం జనగణమణ గీతంతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
-
#WATCH | Prime Minister Narendra Modi says, "Today when we are entering the new Parliament building, when the 'grih pravesh' of Parliamentary democracy is taking place, the witness to the first rays of Independence and that which will inspire generations to come - the holy Sengol… pic.twitter.com/nmOP8guz1C
— ANI (@ANI) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Prime Minister Narendra Modi says, "Today when we are entering the new Parliament building, when the 'grih pravesh' of Parliamentary democracy is taking place, the witness to the first rays of Independence and that which will inspire generations to come - the holy Sengol… pic.twitter.com/nmOP8guz1C
— ANI (@ANI) September 19, 2023#WATCH | Prime Minister Narendra Modi says, "Today when we are entering the new Parliament building, when the 'grih pravesh' of Parliamentary democracy is taking place, the witness to the first rays of Independence and that which will inspire generations to come - the holy Sengol… pic.twitter.com/nmOP8guz1C
— ANI (@ANI) September 19, 2023
-
#WATCH | Ahead of the proceedings of Lok Sabha in the New Parliament building, Speaker Om Birla says "Today is a very important day in the history of democracy as we are starting the proceedings of Lok Sabha in the new Parliament building. We are fortunate enough to witness this… pic.twitter.com/g6tnuUg7Iz
— ANI (@ANI) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Ahead of the proceedings of Lok Sabha in the New Parliament building, Speaker Om Birla says "Today is a very important day in the history of democracy as we are starting the proceedings of Lok Sabha in the new Parliament building. We are fortunate enough to witness this… pic.twitter.com/g6tnuUg7Iz
— ANI (@ANI) September 19, 2023#WATCH | Ahead of the proceedings of Lok Sabha in the New Parliament building, Speaker Om Birla says "Today is a very important day in the history of democracy as we are starting the proceedings of Lok Sabha in the new Parliament building. We are fortunate enough to witness this… pic.twitter.com/g6tnuUg7Iz
— ANI (@ANI) September 19, 2023
Old Parliament Building Name : నూతన పార్లమెంట్‌లో తొలిసారిగా మాట్లాడిన స్పీకర్ ఓం బిర్లా.. ప్రజా సమస్యలపై చర్చించే సమయంలో కొత్త ఒరవడిని సృష్టించాలని సభ్యులకు పిలుపునిచ్చారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన స్పీకర్.. కొత్త పార్లమెంట్‌లోకి మారడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు, రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించారు. ఇక నుంచి పార్లమెంట్ పాత భవనాన్ని సంవిధాన్ సదన్‌గా పిలువనున్నట్లు వెల్లడించారు స్పీకర్ ఓం బిర్లా. సభలో ఉపయోగించే పదాలైన.. హౌజ్, లాబీ, గ్యాలరీలను.. కొత్త పార్లమెంట్‌గా వ్యవహరించాలని చెప్పారు. అంతకుముందు పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. పాత భవనాన్ని సంవిధాన్ సదన్‌గా పిలుచుకుందామని సలహా ఇచ్చారు. రాజ్యాంగకర్తల స్ఫూర్తిని భావితరాలకు అందిద్దామని తెలిపారు.
-
VIDEO | PM Modi greeted by Lok Sabha members as he arrives in the Lok Sabha of new Parliament building. pic.twitter.com/pta1C8ak2h
— Press Trust of India (@PTI_News) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | PM Modi greeted by Lok Sabha members as he arrives in the Lok Sabha of new Parliament building. pic.twitter.com/pta1C8ak2h
— Press Trust of India (@PTI_News) September 19, 2023VIDEO | PM Modi greeted by Lok Sabha members as he arrives in the Lok Sabha of new Parliament building. pic.twitter.com/pta1C8ak2h
— Press Trust of India (@PTI_News) September 19, 2023
-
#WATCH | Proceedings of the Lok Sabha begin in the New Parliament building. pic.twitter.com/LafXM9xUD9
— ANI (@ANI) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Proceedings of the Lok Sabha begin in the New Parliament building. pic.twitter.com/LafXM9xUD9
— ANI (@ANI) September 19, 2023#WATCH | Proceedings of the Lok Sabha begin in the New Parliament building. pic.twitter.com/LafXM9xUD9
— ANI (@ANI) September 19, 2023
Modi Speech In New Parliament : మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు ప్రధాని మోదీ స్వయంగా నూతన పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. 'నారీ శక్తి వందన్ అభియాన్' పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మోదీ తెలిపారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఎంపీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారన్న మోదీ... అనేక రంగాల్లో మహిళలు నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. కొత్త భవనంలో నారీశక్తిని బలోపేతం చేసేలా... తొలి నిర్ణయం తీసుకోబోతున్నామని ప్రకటించారు. అభివృద్ధి ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం మరింత పెంచాలనుకుంటున్నామని మోదీ తెలిపారు.
Women Reservation Bill 2023 Today in Lok Sabha : లోక్‌సభ ముందుకు మహిళా బిల్లు.. ఆమోదం ఎప్పుడంటే..
PM Modi Speech in Parliament Today : ఎన్డీఏ సర్కార్ నిర్ణయాలతో భారత్‌లో కొత్త జోష్: ప్రధాని మోదీ