ETV Bharat / bharat

'కొత్త పార్లమెంటు భవనం భారతీయుల నైతికతకు ప్రతీక'

author img

By

Published : Dec 10, 2020, 7:01 PM IST

పార్లమెంటు నూతన భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. భారతీయుల నైతికతకు ఈ భవనం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అది భారతీయుల నైతికతకు ప్రతీక:ఉపరాష్ట్రపతి

పార్లమెంటు నూతన భవనం.. భారతీయుల నైతికత, 21వ శతాబ్దపు భారతీయ వైవిధ్య గుర్తింపును ప్రతిబింబిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నూతన భవనానికి శంకుస్థాపన చేసినందుకు ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు.

"నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసినందుకు ప్రధాని మోదీకి అభినందనలు. ఈ భవనం భారతీయుల నైతికత, 21 శతాబ్దపు భారతీయ గుర్తింపును ప్రతిబింబిస్తుంది. వందేళ్ల తర్వాత ఈ నిర్మాణం మోదీ నేతృత్వంలో చేపట్టడం సంతోషంగా ఉంది. ఖరీదు పరంగానే కాకుండా, విధానపరంగానూ ఈ భవనం సౌకర్యవంతంగా ఉంటుంది."

-- ఉపరాష్ట్రపతి, వెంకయ్య నాయుడు.

ప్రతి భారతీయుడు గర్వించదగిన అద్భుతమైన మైలురాయిగా నూతన భవనం నిలుస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. భారతదేశ పునరుజ్జీవం, స్థితిస్థాపకత, ప్రతిస్పందనలకు ప్రతీకగా ఉంటుందని తెలిపారు.

ఇదీ చూడండి:'భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో మైలురాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.