'130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ సుదినం'
దేశంలో ప్రజాస్వామ్యం విఫలం అవుతుందని వచ్చిన వాదనలను భారత్ పటాపంచలు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతా చూస్తుండగానే దేశ ప్రజాస్వామ్యం అద్భుతంగా పురోగమిస్తూ ముందుకు సాగుతోందని పార్లమెంటు భవన శంకుస్థాపన కార్యక్రమంలో గుర్తు చేశారు.
ఈ రోజు భారతీయులకు చరిత్రాత్మక దినం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన అనంతరం మోదీ ప్రసంగించారు. 'భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. 130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ సుదినం ఇది. దేశ ప్రజలందరూ కలిసి నిర్మించుకుంటున్న భవనం ఇది. స్వాతంత్ర్యం వచ్చిన 75ఏళ్ల సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుంది. ప్రస్తుత పార్లమెంట్ భవనంలోనే భారత రాజ్యాంగ రచన జరిగింది' అని మోదీ తెలిపారు.