Covid Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. మరో 949 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,039,972కు చేరింది. వైరస్ ధాటికి ఆరుగురు చనిపోయారు. 810 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 11,191గా ఉన్నాయి.
- యాక్టివ్ కేసులు: 11,191
- మరణాలు: 5,21,743
- మొత్తం కేసులు: 43,039,972
- రికవరీలు: 4,25,07,038
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 6,66,660 మందికి గురువారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,30,62,546కు చేరింది. కొత్తగా 367,213 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 795,756,615 కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 938,297 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 3,370 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- దక్షిణ కొరియాలో తాజాగా 148,417 కరోనా కేసులు నమోదయ్యాయి. 318 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 160,914 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 309 మంది మృతిచెందారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 137,342 మంది వైరస్ సోకింది. మరో 133 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో 53,426 కరోనా కేసులు బయటపడ్డాయి. 45 మంది వైరస్‌కు బలయ్యారు.
- ఇటలీలో 64,951 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 149 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి: