Couple fell from crane: ఈ కాలంలో పెళ్లి అంటే.. సాధారణ కార్యక్రమం మాత్రమే కాదు. అదో ఆడంబరం. విలాసవంతమైన హోటల్లో వేడుకలు, డెస్టినేషన్ వెడ్డింగులు, ఖరీదైన పార్టీలు... ఇలా నవవధూవరులు ఎక్కడా తగ్గడం లేదు.
Chattisgarh marriage crane video
ఇలాగే ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌కు చెందిన జంట సైతం ఘనంగా వివాహ వేడుక నిర్వహించుకోవాలని అనుకుంది. సినిమా స్టైల్లో క్రేన్ ద్వారా వేదికపైకి చేరుకోవాలని భావించింది. అన్ని ఏర్పాట్లూ ఘనంగా చేసుకుంది. అయితే, చివరి నిమిషంలో క్రేన్ వేదికపై కూలిపోయింది. 12 అడుగుల పై నుంచి వధూవరులు కింద పడిపోయారు. దీంతో అతిథులు షాక్‌కు గురయ్యారు.
సాంకేతిక తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఈవెంట్ నిర్వాహకుడు ఈటీవీ భారత్‌తో చెప్పారు. వధూవరులు ఇద్దరూ సురక్షితమేనని స్పష్టం చేశారు. ఘటన ఎలా జరిగిందనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు. అయితే, ప్రమాదం తర్వాత కార్యక్రమం యథావిధిగా జరిగిందని చెప్పారు. కుటుంబ సభ్యులందరూ ఇందులో పాల్గొన్నారని తెలిపారు.
కొత్తజంట కిందపడిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్గా మారింది.
ఇదీ చదవండి: హెల్మెట్, స్టెతస్కోప్‌లో రూ. 13 కోట్ల డ్రగ్స్!