ETV Bharat / bharat

New Born Babies Deaths In Maharashtra : ఆస్పత్రిలో ఒకే రోజు 24 మంది మృతి.. 12 మంది నవజాత శిశువులు కూడా.. - ఆస్పత్రిలో ఒకే రోజు 24 మంది మృతి

New Born Babies Deaths In Maharashtra : మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు 12 మంది నవజాత శిశువులు సహా 24 మంది మృతి చెందారు. ఆస్పత్రిలో ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే వీరంతా మరణించినట్లు తెలుస్తోంది.

new born babies deaths maharashtra
new born babies deaths maharashtra
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 8:54 PM IST

Updated : Oct 2, 2023, 10:54 PM IST

New Born Babies Deaths In Maharashtra : ఒక్క రోజు వ్యవధిలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో 12 మంది నవజాత శిశువులు సహా 24 మంది మరణించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్​లో ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కాలేజీలో జరిగింది. వైద్యులు, మందుల కొరత వల్లే వీరంతా మరణించినట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 24 మంది మృతిచెందగా.. వీరిలో 12 మంది రోగులు పలు వ్యాధులు, పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి డీన్‌ శ్యామ్​రావ్​ వాకోడె వెల్లడించారు. ఆస్పత్రిలో పలువురు సిబ్బందిని బదిలీ చేయడం వల్ల రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వివరించారు. సరిపోయేంత బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల మందులు కొనుగోలు చేయలేకపోతున్నట్లు తెలిపారు. నాందేడ్​ పరిసర ప్రాంతాల్లో ఇదే అతిపెద్ద ఆస్పత్రి అని.. దీంతో రోగులు ఎక్కువగా రావడం వల్ల సౌకర్యాలు సరిపోవడం లేదని చెప్పారు. ఇతర జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి కూడా రోగులు వస్తారన్నారు.

ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యవిద్యా శాఖ డైరెక్టర్​ డాక్టర్ దిలీప్​ మహైశేఖర్​ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట లోపు దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆస్పత్రిలో ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించేందుకు తాను ప్రత్యేకంగా వెళుతున్నట్లు పేర్కొన్నారు.

  • Maharashtra | Congress leader Ashok Chavan says, "Around 24 people's death has been reported at the Dr. Shankarrao Chavan Medical College and Hospital & therefore I have come here and met the Dean. The situation is concerning & serious. The government should take this up &… https://t.co/nnr2mEuTdG pic.twitter.com/bfZ107L1ho

    — ANI (@ANI) October 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Maharashtra | Congress leader Ashok Chavan visits Dr. Shankarrao Chavan Medical College and Hospital in Nanded where around 24 people died due to various ailments (snake bites, arsenic and phosphorus poisoning etc.) pic.twitter.com/5qTKbvQjOk

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఫైర్​
మరోవైపు ఈ అంశంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మూడు ఇంజిన్ల (బీజేపీ, ఏక్‌నాథ్‌ శిందే- శివసేన, ఎన్​సీపీ- అజిత్‌ వర్గం) ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్ నేత అశోక్​ చవాన్​.. ప్రభుత్వం వెంటనే రోగులకు సరైన వైద్య సదుపాయం అందించాలని డిమాండ్ చేశారు. మరో 70 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఆస్పత్రిలో 500 బెడ్లు ఉంటే ప్రస్తుతం 1200 మంది రోగులు ఉన్నారని ఆరోపించారు.

ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాలని ఎన్​సీపీ డిమాండ్
ఆస్పత్రిలో ఒకేరోజు 12 మంది నవజాత శిశువులు సహా 24మంది మృతిచెందిన ఘటనను ఎన్​సీపీ ఎంపీ సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. ఈ మరణాలు ఖచ్చితంగా యాదృచ్చికం కాదన్న ఆమె.. వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఠాణెలో ప్రదర్శించిన అజాగ్రత్తే ఈసారి కూడా కనిపిస్తోందని ఆరోపించారు. ఒకరి తప్పుల్ని మరొకరు కప్పిపుచ్చుకొనేందుకు దాగుడు మూతలు ఆడుతున్నారని ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఆస్పత్రుల్లో ఔషధాల కొరత కారణంగా సకాలంలో మందులు అందడంలేదని రోగులు వాపోతున్నారని చెప్పారు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని సుప్రియా సూలే డిమాండ్‌ చేశారు. సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని.. మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని సీఎం ఏక్‌నాథ్‌ శిందేను డిమాండ్‌ చేశారు.

ఆస్పత్రిలో 4 గంటలు పవర్​ కట్​.. నలుగురు నవజాత శిశువులు మృతి

Newborns Die Of Cold : ఏసీ వేసుకుని హాయిగా నిద్రపోయిన డాక్టర్​.. చలికి ఇద్దరు నవజాత శిశువులు మృతి!

Last Updated : Oct 2, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.