ETV Bharat / bharat

6నెలల క్రితం నేపాల్​ మహిళ అదృశ్యం.. చెట్టుకు అస్థిపంజరంగా వేలాడుతూ.. అసలేమైంది? - wife killed by husband

ఆరు నెలల క్రితం అదృశ్యమైన ఓ మహిళ.. నిర్మాన్యుష్య ప్రాంతంలో చెట్టుకు అస్థిపంజరంగా వేలాడుతూ కనిపించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. ఆమెను నేపాల్​కు చెందిన కూలీ భార్యగా గుర్తించారు. అసలేం జరిగిందంటే?

Bengaluru: Nepal woman who went missing six months ago: Found as skeleton in hanging position

author img

By

Published : Feb 4, 2023, 7:45 AM IST

భర్తపై కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ.. సుమారు ఆరు నెలల తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు అస్థిపంజరంగా వేలాడుతూ కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. ఆమెను నేపాల్​కు చెందిన పుష్పా ధామిగా గుర్తించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

పోలీసుల వివరాలు ఇలా..
"శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో హుళిమావు పోలీస్​స్టేషన్​ పరిధిలోని అపార్ట్​మెంట్​ వెనుక చెట్టుకు అస్థిపంజరం వేలాడుతున్నట్లు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాం. అక్కడ పాత చెప్పులు, నెక్లెస్​, మరికొన్ని వస్తువులు దొరికాయి. అక్కడ లభించిన వస్తువులను ఫోరెనిక్స్​ సైన్స్​ ల్యాబ్​కు పంపించాం. ఆ తర్వాత గత ఏడాదిలో నమోదైన మిస్సింగ్​ కేసులు పరిశీలించాం. అప్పుడు జులై 8న నేపాల్​కు చెందిన ఓ మహిళ అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదును గుర్తించాం. నేపాల్‌కు చెందిన పుష్ప ధామి ఆరు నెలల క్రితం అదృశ్యమైంది. చిన్న విషయమై భర్తతో గొడవ జరగడం వల్ల ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత భార్య అదృశ్యంపై ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఫిర్యాదు చేసే సమయంలో అతడు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించగా దొరికిన అస్థిపంజరం పుష్ప ధామిదేనని, ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తేలింది" అని డీసీపీ తెలిపారు.

Bengaluru: Nepal woman who went missing six months ago: Found as skeleton in hanging position
పుష్పా ధామి

4ఏళ్ల బాలికపై ఇంటి యజమాని కొడుకు అత్యాచారం..
బిహార్​లోని రోహతాస్​లో దారుణం జరిగింది. ఎవరూ లేని సమయంలో నాలుగేళ్ల బాలికపై ఇంటి యజమాని కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు.. ఘటనాస్థలికి వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. శివసాగర్​ పోలీస్​స్టేషన్​పరిధిలోని ఓ గ్రామంలో బాధితురాలు.. తన కుటుంబంతో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. అయితే బాధితురాలి తల్లి.. ఓ పనిమీద పొరిగింటికి వెళ్లింది. ఇదే ఆసరాగా తీసుకున్నాడు ఇంటి యజమాని కుమారుడు. బాలిక ఇంట్లోకి వెళ్లి చిప్స్ ఇస్తానంటూ మేడ మీదకు తీసుకెళ్లాడు. అనంతరం దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలు నొప్పి తట్టుకోలేక గట్టిగా అరవడం వల్ల స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని స్టేషన్​కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.

కట్నం కోసం మూడో భార్యను చంపిన భర్త..
బిహార్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. అదనపు కట్నం కోసం మూడో భార్యను హత్య చేసి తగలబెట్టాడు ఓ వ్యక్తి. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కట్నం కోసం మూడో భార్యను చంపిన భర్త

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔరంగాబాద్​కు చెందిన సుబేలాల్​ పాసవాన్​కు మొత్తం మూడు పెళ్లిళ్లు జరిగాయి. అదనపు కట్నం తేవాలని రోజూ మూడో భార్యను వేధించేవాడు. గొడవ జరిగిన ప్రతిసారి దుర్భాషలాడేవాడు. చివరకు ఆమెను హతమార్చి మృతదేహాన్ని తగలబెట్టాడు. మృతురాలి బంధువులు పోలీసులకు.. ఫిర్యాదు చేశారు. మొదటి భార్యను కూడా చంపి ఉంటాడని పోలీసులకు తెలిపారు. అంతే కాకుండా అతడి వేధింపులు తట్టుకోలేక రెండో భార్య వదిలి వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇరుగుపొరుగు వారిని ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.