ETV Bharat / bharat

ఆంక్షలున్నా ఆగని నేపాలీల చొరబాట్లు - నేపాలీల అక్రమ చొరబాట్లు

కరోనా నేపథ్యంలో సరిహద్దులను మూసేసినప్పటికీ.. నేపాల్​ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ తన ఆధార్​ కార్డు చూపిస్తూ.. నేపాలీ మహిళను తన వెంట తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఈ విషయంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది.

NEPAL PEOPLE ENTERING INDIA ILLEGALLY
ఆంక్షలున్నా ఆగని నేపాలీల చొరబాట్లు
author img

By

Published : Dec 8, 2020, 9:44 PM IST

భారత్​లోకి నేపాలీల చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధార్​ కార్డును ఉపయోగించుకొని భారత్​లోకి ప్రవేశిస్తున్నారు నేపాల్ వాసులు. బంబాస సరిహద్దు నుంచి వీరు దేశంలోకి వస్తున్నారు. నేపాల్​కు చెందిన ఓ మహిళ ఆధార్​ కార్డు చూపిస్తూ భారత్​లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వీడియోతో ఈ చొరబాట్ల విషయం బయటపడింది.

కరోనా నేపథ్యంలో ఇరుదేశాల సరిహద్దులను అధికారులు మూసేశారు. ఆధార్​ కార్డు ఉన్న వ్యక్తులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తున్నారు. నేపాల్ వాసులైతే అక్కడి జిల్లా మేజిస్ట్రేట్ నుంచి అనుమతి పత్రం ఉంటేనే రానిస్తున్నారు. అది కూడా భారత్​లో వైద్యం కోసమే వీరికి అనుమతులు మంజూరు చేస్తున్నారు.

నేపాలీ మహిళల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తనతో పాటు మరో మహిళ కూడా భారత్​లోకి ప్రవేశించింది. రెండో మహిళ దగ్గర ఎలాంటి గుర్తింపు పత్రం లేకపోవడం గమనార్హం. కస్టమ్స్ అధికారుల అనుమతి తీసుకొనే వచ్చామని అధికారులతో చెప్పడం వీడియోలో నమోదైంది.

నేపాలీ మహిళల వీడియో

అయితే అనుమతి పత్రం లేకుండా దేశంలోకి వచ్చేందుకు మహిళకు అనుమతించడంపై వివాదం చెలరేగింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ విషయంపై కన్నెర్రజేసింది. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ఉపేక్షించం

కేంద్రంతో పాటు రాష్ట్రాలు సైతం సరిహద్దు చొరబాట్లపై పటిష్ఠ నిఘా ఉంచుతున్నాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రతినిధి మదన్ కౌశిక్ తెలిపారు. అక్రమ వలసలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చొరబాట్ల గురించి తమ దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నకిలీ ఆధార్​లు

మరోవైపు, దేశంలోకి ప్రవేశించేందుకు ఆధార్​ నిబంధన పెట్టిన నేపథ్యంలో నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేపాల్​లో భారత ఆధార్​ కార్డును ఫోర్జరీ చేస్తున్నట్లు చంపావత్​ ఎస్పీ గతంలో వెల్లడించారు. అయితే ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసేసరికి నిందితులు తప్పించుకున్నారు.

ఇదీ చదవండి: 'కరోనా విజృంభిస్తున్నా ప్రజలతోనే మోదీ మమేకం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.