భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ అత్యవసర వినియోదానికి నేపాల్ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలి కొవాగ్జిన్ వినియోగానికి ఆమోద ముద్ర వేసింది.
ఇప్పటికే నేపాల్‌లో ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్, చైనాకు చెందిన సినోఫామ్ టీకాలు అత్యవసర వినియోగంలో ఉండగా.. ప్రస్తుతం కొవాగ్జిన్ అనుమతి పొందింది.
మూడో దశ క్లినికల్ పరీక్షల్లో కొవాగ్జిన్ 81 శాతం సమర్థంగా పనిచేస్తుందని తేలడం వల్ల నేపాల్ ప్రభుత్వం కొవ్యాక్సిన్ వినియోగానికి అనుమతించింది.
ఇదీ చదవండి:'ఇండోపసిఫిక్ సుస్థిరతకు అమెరికా-భారత్ బంధం కీలకం'