ETV Bharat / bharat

5వ తేదీన నీట్​లో 'ఈడబ్ల్యూఎస్' కోటాపై సుప్రీం అత్యవసర విచారణ

NEET PG Exam EWS Quota: నీట్​ పీజీ పరీక్షలో ఈడబ్ల్యూఎస్ కోటా వ్యవహారంపై దాఖలైన పిటిషన్​ను విచారించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మానసం పేర్కొంది.

NEET PG Exam EWS Quota
నీట్​ పీజీ కౌన్సెలింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా
author img

By

Published : Jan 4, 2022, 12:10 PM IST

NEET PG Exam EWS Quota: నీట్‌ పీజీ పరీక్షల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్​) రిజర్వేషన్లు కల్పించిన విషయమై దాఖలైన పిటిషన్లపై బుధవారం అత్యవసర విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారాన్ని బుధవారం విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.

నీట్​ పీజీ కౌన్సెలింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు జడ్జీలతో డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.

అంతకుముందు ఇదే విషయంపై విచారణ చేపట్టాలని కేంద్రం.. సుప్రీంకోర్టును కోరింది. మంగళవారం ఈ వ్యాజ్యాలను విచారణ జరపాలని అభ్యర్థించింది. ఈ మేరకు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ ఏఎస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు.

Resident Doctors Protest: వాస్తవానికి ఈ వ్యాజ్యాలపై విచారణ జనవరి 6న జరగాల్సి ఉంది. అయితే.. నీట్​ పీజీ కౌన్సెలింగ్ ఆలస్యానికి వ్యతిరేకంగా.. దిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన నిరసన ఇటీవల ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో.. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరినట్లు తెలుస్తోంది. తొలుత నవంబర్​ 27న నిరసనకు దిగిన రెసిడెంట్ వైద్యులు.. అనంతరం సుప్రీంకోర్టుకు ర్యాలీగా బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే డాక్టర్లు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది.

దిల్లీలోని ఓ ఆస్పత్రిలో వారిపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సమ్మె బాట పట్టారు. ఎట్టకేలకు దిల్లీ పోలీస్​ కమిషనర్​తో సమావేశం అనంతరం తమ సమ్మెను విరమిస్తూ డిసెంబర్​ 31న నిర్ణయం తీసుకున్నారు.

Center On EWS Qouta In NEET PG: మరోవైపు.. నీట్​ పీజీ పరీక్షల్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్​ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగానే ఉంచనున్నట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు ఆదివారం తెలిపింది. త్రిసభ్య కమిటీ సిఫార్సులను అంగీకరిస్తున్నట్లు న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్​లో స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:

NEET PG Exam: ఈడబ్ల్యూఎస్​ కోటాపై సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ!

ఈడబ్ల్యూఎస్ కోటాపై సమీక్షకు త్రిసభ్య కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.