ETV Bharat / bharat

నీట్-పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి

NEET PG Counselling: నీట్​ పీజీ ప్రవేశాలు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారం నిర్వహించేందుకు అనుమతించింది సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా ఉన్న సీట్లలో ఓబీసీలకు 27శాతం, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీకి 10శాతం రిజర్వేషన్​లకు ఓకే చెప్పింది.

Supreme Court
సుప్రీం కోర్టు
author img

By

Published : Jan 7, 2022, 11:08 AM IST

Updated : Jan 7, 2022, 11:30 AM IST

NEET PG Counselling: నీట్​ పీజీ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. 2021-22 ఏడాది నీట్​ పీజీ కౌన్సెలింగ్​కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్య సీట్లలో.. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే నిర్వహించాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం.. ఓబీసీలకు 27శాతం, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10శాతం రిజర్వేజన్​ కొనసాగనుంది.

జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ ఏఎస్​ బోపన్నల ధర్మాసనం నీట్​-పీజీ కౌన్సెలింగ్​, ఓబీసీ కోటాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు పూర్తి కారణాలను తెలియజేస్తామని పేర్కొంది. ఇప్పటికే ఉన్న ప్రక్రియ ప్రకారమే 2021-22 నీట్​ పీజీ కౌన్సిలింగ్​ నిర్వహించాలని సూచించింది.

ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు వార్షిక ఆదాయం రూ.8లక్షలుగా నిర్ణయించటంపై తుది తీర్పులో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది ధర్మాసనం. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణను మార్చ్​ 5న చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. అదే రోజు తుది తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

Last Updated : Jan 7, 2022, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.