ETV Bharat / bharat

కర్ణాటకలో రెండు కోట్ల మందికి కరోనా! - Karnataka Health Minister

కర్ణాటకలో సుమారు రెండు కోట్ల మందికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. రాష్ట్రంలో కొవిడ్​ కేసులు పెరుగుదలను అంచనా వేసేందుకు సెప్టెంబర్​లో ఈ సర్వే జరిపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి డాక్టర్​ సుధాకర్ తెలిపారు.​

Nearly 2 crore people in Karnataka were COVID-19 infected, says govt survey
కర్ణాటకలో రెండు కోట్ల మందికి కరోనా!
author img

By

Published : Nov 4, 2020, 7:27 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలను అంచనా వేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఓ సర్వే నిర్వహించింది. ఇప్పటికే సుమారుగా 1.93 కోట్లు లేదా రాష్ట్ర జనాభాలో 27.3శాతం మందికి కరోనా సోకినట్లు ఈ సర్వేలో తేలింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.

మహమ్మారి ధాటికి 0.05శాతం మంది మరణించినట్లు వెల్లడైంది. అయితే ప్రస్తుతం ఈ రేటు తక్కువగా ఉండవచ్చని ఈ నివేదిక పేర్కొంది. తొలి రౌండ్​​ సెరో సర్వే ఫలితాల ప్రకారం మొత్తం మరణాల రేటు 0.07 శాతమని వెల్లడించింది. యాంటీబాడీ పరీక్షల ఆధారంగా రాష్ట్రంలో 16.4 శాతం మంది కొవిడ్ బారిన పడినట్లు తేలింది.

30జిల్లాల్లో సెప్టెంబరు 3 నుంచి 16వరకు సర్వే నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్​ సుధాకర్​ తెలిపారు. జిల్లాల్లో కరోనా ఏ విధంగా వ్యాపిస్తోంది.. వైరస్ వ్యాప్తి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి వాటి గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించినట్లు ఆయన​ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మొత్తం 16,585 నమూనాలకుగానూ 15,624 నివేదికలు సమర్పించామని సుధాకర్​ వెల్లడించారు. ఈ సర్వేలో ఆర్​టీపీసీఆర్​, రాపిడ్​ యాంటిజెన్​ సహా ఇమ్యునోగ్లోబులిన్​ జీ టెస్ట్​లు కూడా చేసినట్లు సుధాకర్​ తెలిపారు.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో రేపటి నుంచి సినిమా హాళ్లు ఓపెన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.