అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా.. కాంగ్రెస్ కూటమి రెండో స్థానంలో కొనసాగుతోంది.
ముజిలి నుంచి బరిలో ఉన్న ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వాస్ శర్మ(జులుక్‌బరి), ఏజీబీ చీఫ్ అతుల్ బొరా(బొకాకత్) ఆధిక్యంలో ఉన్నారు.