మహారాష్ట్ర నాగపుర్లో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాలకు నాసిక్ జిల్లాకు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్ తన పసిబిడ్డతో హాజరయ్యారు. "నేను ఇప్పుడు ఒక తల్లిని, ప్రజాప్రతినిధిని. గత రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా నాగపుర్లో అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. ఇప్పుడు నేను ఒక పసిబిడ్డకు తల్లినే అయినా.. నేను నా ప్రశ్నలను లేవనెత్తి వాటికి ప్రభుత్వం నుంచి సమాధానాలను పొందేందుకే నా బిడ్డను ఎత్తుకుని ఇక్కడికి వచ్చాను".
![NCP MLA who attended the winter meeting in Maharashtra with a two-and-a-half-month-old baby](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17249392_bdfbg.jpeg)
ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్ కుమారుడికి ఇప్పుడు రెండున్నర నెలల వయసు. సరోజ్ సెప్టెంబరు 30న ఈ బిడ్డకు జన్మనిచ్చారు.
![NCP MLA who attended the winter meeting in Maharashtra with a two-and-a-half-month-old baby](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17249392_gvdfg.jpg)