ETV Bharat / bharat

సుప్రీంకు చేరిన 'మహా' లేఖ వ్యవహారం - అనిల్​ దేశ్​ముఖ్

హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి పేర్కొన్నారు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​. లేఖలో పేర్కొన్న సమయంలో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. మరోవైపు.. తన ఆరోపణల్లోని నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు మాజీ సీపీ పరమ్​బీర్​ సింగ్​.

supreme court
సుప్రీం కోర్టుకు చేరిన 'మహా' లేఖ వ్యవహారం
author img

By

Published : Mar 22, 2021, 1:28 PM IST

Updated : Mar 22, 2021, 2:40 PM IST

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​పై ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్ పరమ్​బీర్ సింగ్​ ఆరోపణల వ్యవహారంలో నష్టనివారణ చర్యలు ముమ్మరం చేసింది ఎన్​సీపీ. ఆయనపై పరమ్​బీర్​ చేసిన ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. లేఖలో పేర్కొన్న సమయంలో దేశ్​ముఖ్​ ఎలాంటి సమావేశం నిర్వహించలేదని స్పష్టం చేసింది.

" మాజీ కమిషనర్​ లేఖను పరిశీలిస్తే.. ఫిబ్రవరి మధ్యలో పలువురు అధికారులు తమకు హోంమంత్రి ఆ ఆదేశాలు ఇచ్చారని చెప్పినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 నుంచి 16వ తేదీ వరకు దేశ్​ముక్​ కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరారు. ఆరోపణలు చేసిన సమయంలో హోంమంత్రి ఆసుపత్రిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆరోపణలకు ఎలాంటి బలం లేదు. అవి నిరాధారమైనవని తేలింది. "

- శరద్​ పవార్​, ఎన్సీపీ అధినేత

హోమ్​ క్వారంటైన్​లో ఉన్నా: దేశ్​ముఖ్​

తాను ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు హోమ్​ క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపారు హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​. ఫిబ్రవరి 28నే తన ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. అయితే.. ఆసుపత్రి నుంచి ఫిబ్రవరి 15న డిశ్చార్జ్​ అయినప్పుడు కొంతమంత్రి జర్నలిస్టులు గేట్​ వద్ద ఉన్నారని, నేను నీరసంగా ఉన్న కారణంగా అక్కడే కుర్చీలో కూర్చొని వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్నారు. ఆ తర్వాత నేరుగా కారులో ఎక్కి ఇంటికి వెళ్లానని తెలిపారు.

సుప్రీం కోర్టుకు పరమ్​బీర్​

హోంమంత్రి దేశ్​ముఖ్​పై తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు పరమ్​బీర్​ సింగ్​. తన లేఖలో పేర్కొన్నట్లు ఆ సమయంలో హోంమంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ పేర్కొన్న క్రమంలో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ముంబయి పోలీస్​ కమిషనర్​గా తప్పించి... హోంగార్డ్​ విభాగానికి బదిలీ చేయడాన్ని కూడా సవాల్​ చేశారు పరమ్​బీర్.

ఇదీ చూడండి: పరమ్​Xదేశ్​ముఖ్​- 'మహా'లో లేఖ దుమారం

Last Updated : Mar 22, 2021, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.