NCL Apprentice Jobs 2023 : మినీ రత్న హోదా గల ప్రభుత్వ రంగ సంస్థ.. నార్తర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (NCL) 1140 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 15లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఫిట్టర్ - 543 పోస్టులు
- ఎలక్ట్రీషియన్ - 370 పోస్టులు
- వెల్డర్ - 155 పోస్టులు
- మోటార్ మెకానిక్ - 47
- ఎలక్ట్రానిక్ మెకానిక్ - 13 పోస్టులు
- ఆటో ఎలక్ట్రీషియన్ - 12
- మొత్తం అప్రెంటీస్ పోస్టులు - 1140
విద్యార్హతలు
NCL Apprentice Qualification : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలో పదో తరగతి లేదా 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆయా పోస్టులకు అనుగుణంగా (ఎలక్ట్రానిక్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్/ వెల్డర్/ మోటార్ మెకానిక్ / ఆటో ఎలక్ట్రీషియన్ ) ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ముఖ్యంగా NCVT/ SCVT ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి
NCL Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 అక్టోబర్ 31 నాటికి 18 ఏళ్లు నుంచి 26 ఏళ్లు మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ
NCL Apprentice Selection Process : 10వ తరగతి + ఐటీఐ ట్రేడ్ టెస్ట్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను.. అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది.
ట్రైనింగ్ - స్టైపెండ్
NCL Apprentice Training : ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో వారికి నెలకు రూ.8,050 చొప్పున స్టైపెండ్ అందిస్తారు. వెల్డర్ పోస్టులకు మాత్రం రూ.7,700 స్టైపెండ్ ఇస్తారు.
దరఖాస్తు చేయండి ఇలా!
NCL Apprentice Online Apply Process : ఆసక్తి గల అభ్యర్థులు అన్లైన్లో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా ఎన్సీఎల్ అధికారిక వెబ్సైట్ https://www.nclcil.in/ ఓపెన్ చేయాలి.
- NCL Apprentice Recruitment 2023 లింక్‌పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
- మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు దరఖాస్తు ఫారంలో నమోదు చేయాలి.
- ముఖ్యమైన విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి.
- అన్ని వివరాలను ఒకసారి చెక్ చేసుకుని.. అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని, భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
NCL Apprentice Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 అక్టోబర్ 5
- దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 2023 అక్టోబర్ 15
ESIC Paramedical Recruitment 2023 : ESICలో 1038 ఉద్యోగాలు.. తెలంగాణలోనూ ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే!
PGCIL Recruitment 2023 : పవర్ గ్రిడ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.లక్షపైనే.. క్వాలిఫికేషన్ ఏంటంటే?