ETV Bharat / bharat

డ్రగ్స్ సరఫరా చేస్తూ ఓ పాకిస్థానీ.. మరో ముగ్గురు అరెస్టు - మాదక ద్రవ్యాల పట్టివేత

నిషేధిత మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవడంలో భాగంగా నిర్వహించిన తనిఖీలో భాగంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు ఎన్​సీబీ అధికారులు. వారిలో ఒకరు పాకిస్థాన్​ వాసి అని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా కేసులో మరో ఇద్దరిని ముంబయి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

NCB, drugs smuggling
డ్రగ్స్ సరఫరా, ఎన్​సీబీ
author img

By

Published : Apr 17, 2021, 6:00 PM IST

సరిహద్దు భద్రతా దళాల సాయంతో శనివారం నిర్వహించిన ఆపరేషన్​లో.. డగ్స్​ సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్​సీబీ) పేర్కొంది. ఇందులో పాకిస్థాన్​కు చెందిన వ్యక్తి ఉన్నట్లు తెలిపింది. నిందితుల నుంచి 20.57 కేజీల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

పాకిస్థాన్ లాహోర్​కు చెందిన అమ్​జద్​ అలీ అకా మజీద్ జట్ట్ దగ్గర హెరాయిన్ లభ్యమైనట్లు ఎన్​సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు. మరో నిందుతుడి పేరు జెర్నైల్ సింగ్​ అని తెలిపారు. నిందితుల నుంచి డ్రగ్స్ సరఫరాకు ఉపయోగించే వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ముంబయి​లో..

30గ్రాముల మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఇద్దరిని ముంబయిలోని మాదక ద్రవ్యాల నిరోధక బృందం(ఏఎన్​సీ) అరెస్టు చేసింది. ఈ డ్రగ్స్ విలువ 30 లక్షలు ఉంటుందని పేర్కొంది.

ఇదీ చదవండి:గుల్మార్గ్​లో హిమపాతం- పర్యటకులు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.