ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టును మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడు కోసగా గుర్తించారు. అతనికి 15 కేసులతో ప్రమేయం ఉండటం సహా తలపై రూ.5లక్షల రివార్డు ఉంది.
నీలవాయ అడవుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్, నక్సల్స్ వ్యతిరేక దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో.. మావోయిస్టు హతమైనట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ చెప్పారు. ఘటనాస్థలం నుంచి 9ఎంఎం పిస్టల్, దేశీవాళీ బార్మర్, 3 కిలోల పేలుడు పదార్థాలు, మందులు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బీజాపుర్ ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు అమరులైన తర్వాత జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు
ఇదీ చూడండి: మావోయిస్టుల మరో దుశ్చర్య.. 5 వాహనాలకు నిప్పు!