ETV Bharat / bharat

దంతెవాడ పేలుడు​ అసలు సూత్రధారి అతడే!.. ఫాక్స్​హోల్​ టెక్నాలజీతో దాడి.. - chhattisgarh latest news

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఐఈడీ పేలుడు వెనక ప్రధాన సూత్రధారి మావోయిస్ట్ నేత జగదీశ్‌ సోధి అని తెలుస్తోంది. అతడి వ్యూహరచనలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు నెలల ముందే పేలుడుకు పథకం రచించినట్లు వెల్లడించారు. పోలీసులు నుంచి తప్పించుకోవడానికి ఫాక్స్‌ హోల్‌ మెకానిజం అనే పద్ధతిని ఉపయోగించినట్లు బస్తర్ పోలీసులు తెలిపారు

Dantewada blast
Dantewada blast
author img

By

Published : Apr 30, 2023, 5:34 PM IST

Updated : Apr 30, 2023, 8:35 PM IST

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో జరిగిన ఐఈడీ పేలుడు కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మావోయిస్ట్‌ నేత జగదీశ్‌ సోధి ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని పోలీసులు చెబుతున్నారు. అతడి మీద ఐదు లక్షల రివార్డు కూడా ఉన్నట్లు వెల్లడించారు. సూత్రధారిని గుర్తించడంతో పాటు పేలుడుకు ఉపయోగించిన పద్ధతిని పోలీసులు ఛేదించారు. ఫాక్స్‌ హోల్‌ మెకానిజం అనే పద్ధతిని ఉపయోగించి రెండు నెలల ముందుగానే ఐఈడీని రహదారి కింద అమర్చినట్లు గుర్తించారు. ఫాక్స్‌ హోల్ అనేది సొరంగం తవ్వడంలో ఒక శైలి. ఇది పోలీసులు నుంచి మావోయిస్టులను తప్పించడంలో ఉపయోగపడుతుంది. మందుపాతరలను గుర్తించేటప్పుడు కూడా ఆ సొరంగాన్ని కనుగొనలేమని పోలీసులు వెల్లడించారు.

పేలుడు కోసం ఐఈడీని రెండు నెలల ముందుగానే రహదారి కింద అమర్చినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ నెల 26న మావోయిస్టుల కోసం కూంబింగ్‌ చేపట్టి తిరిగి వస్తుండగా దంతెవాడలో జరిగిన బాంబు పేలుడులో 10 మంది డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్‌తో పాటు ఒక పౌరుడు మరణించారు. బాంబు పేలుడు అనంతరం మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో పేలుడు జరిగిన మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది. కాగా.. భద్రతా బలగాలపై దాడులు చేస్తామని నక్సల్స్‌ పేరుతో గతవారం పోలీసులకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈలోపే ఈ దుర్ఘటన జరిగింది.

దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో బుధవారం ఉదయం డిస్ట్రిక్‌ రిజర్వ్‌గార్డ్‌ ( DRG) పోలీసులు.. ప్రత్యేక యాంటీ-నక్సలైట్‌తో కలిసి ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఆపరేషన్‌ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా.. అరణ్​పుర్‌ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీతో వాహనాన్ని పేల్చేశారు. దాడి జరిగిందని సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు.

50కేజీల ఐఈడీ..
ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులపై దాడి చేసేందుకు నక్సల్స్‌ 50 కేజీల ఐఈడీని ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక, పోలీసులు ప్రయాణించిన మినీ వ్యాన్‌ను అద్దెకు తీసుకున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

స్పష్టమైన సమాచారంతోనే..
ఐఈడీలను అరన్‌పుర్‌-జగర్‌గుండ రోడ్డు కింద 24 నుంచి 48 గంటల ముందే అమర్చి ఉంటారని ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు. భద్రతా దళాల కదలికలపై స్పష్టమైన సమాచారం వచ్చాకే అరన్‌పుర్‌-జగర్‌గుండ రోడ్డు పక్క నుంచి సొరంగాన్ని తవ్వారు. వీటిని ఫాక్స్‌ హోల్స్‌గా వ్యవహరిస్తారు.

ఇవీ చదవండి : పుట్టిన రోజు నాడే పునర్జన్మ.. 20 గంటలు మృత్యువుతో పోరాడి..

కర్ణాటకలో 'వైఫ్ పాలిటిక్స్'.. భర్తలకు స్టార్​ క్యాంపెయినర్లుగా ప్రచారం.. గెలిపిస్తారా?

Last Updated : Apr 30, 2023, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.