ETV Bharat / bharat

'1993 పేలుళ్ల​ దోషితో నవాబ్​ మాలిక్​కు సంబంధాలున్నాయి' - క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌కు(Nawab Malik Latest News) చీకటి సామ్రాజ్యం(అండర్ వరల్డ్)తో సంబంధాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌(Fadnavis News). 1993లో ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అండర్‌ వరల్డ్ వ్యక్తితో మాలిక్ ఆస్తి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.

Fadnavis
ఫడణవీస్‌
author img

By

Published : Nov 9, 2021, 5:09 PM IST

Updated : Nov 9, 2021, 5:27 PM IST

ముంబయిలోని క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసు(Mumbai Cruise Drug Case) అనేక మలుపులు తీసుకుంటోంది. దానిలో భాగంగానే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు(Nawab Malik Latest News) సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌(Fadnavis News). చెప్పినట్లుగానే దీపావళి తర్వాత బాంబు పేల్చారు.

"దీపావళి తర్వాత కొన్ని విషయాలు బయటపెడతానని ముందే చెప్పాను. దానికి సంబంధించిన పత్రాలు అందడానికి కొంచెం సమయం పట్టింది. నేను ఎవరో రాసింది చదవడం లేదు. నవాబ్‌ మాలిక్‌కు చీకటి సామ్రాజ్యం(అండర్ వరల్డ్)తో సంబంధాలున్నాయి. 1993లో ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అండర్‌ వరల్డ్ వ్యక్తితో మాలిక్ ఆస్తి ఒప్పందాలు చేసుకున్నారు. కుర్లాలో ఎల్‌బీఎస్ రోడ్డులో 2.80 ఎకరాల స్థలాన్ని గోవాలా కాంపౌండ్ అని పిలుస్తారు. దానికి సాలిడస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్ పేరిట రిజిస్ట్రేషన్ ఉంది. ఆ కంపెనీ నవాబ్ కుటుంబానికి చెందింది. ఆయన కూడా ఆ కంపెనీలో బాధ్యతలు నిర్వహించేవారు. అయితే మంత్రి అయిన తర్వాత కంపెనీ నుంచి వైదొలిగారు. నేను చెప్పిన స్థలాన్ని అండర్ వరల్డ్ నుంచి రూ.30 లక్షలకే కొనుగోలు చేశారు. కేవలం రూ.20 లక్షలు మాత్రమే చెల్లించారు. ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందనేది నా ప్రశ్న? మీకు సలీం పటేల్ తెలీదా? ఎందుకు మీరు ఆ దోషుల నుంచి భూమి కొన్నారు? ఎల్‌బీఎస్‌ రోడ్డులో ఆ స్థలాన్ని కేవలం రూ.30 లక్షలకే వారు మీకెందుకు అమ్మేశారు?"

--- దేవేంద్ర ఫడణవీస్‌, మహారాష్ట్ర మాజీ సీఎం

శరద్‌ పవార్‌కూ ఆధారాలు ఇస్తా..

ఈ వాస్తవాలన్నీ.. నవాబ్‌కు(Nawab Malik Latest News) అండర్‌ వరల్డ్‌తో ఉన్న సంబంధాలను వెల్లడిచేస్తోందన్నారు ఫడణవీస్(Fadnavis News)​. 'వాళ్లు ఆర్డీఎక్స్ కొనుగోలు చేసి, పేలుళ్లకు పాల్పడతారు. వారితో మంత్రి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు. ఈ వివరాల్నింటిని సంబంధిత యంత్రాంగానికి అందజేస్తాను. అలాగే ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌కు కూడా ఇస్తాను. అప్పుడే మాలిక్ ఎలాంటి వ్యక్తో ఆయనకు కూడా తెలుస్తుంది' అంటూ ఆరోపణలు చేశారు.

గ్యాంగ్‌స్టర్ దావుద్ ఇబ్రహీం సన్నిహితుడే సలీం పటేల్. దావుద్ సోదరి హసీనా పార్కర్‌కు డ్రైవర్‌గా పనిచేశాడు. దావుద్ దేశం విడిచిపారిపోయిన తర్వాత ఈ డ్రైవర్ ద్వారానే హసీనా తన సోదరుడి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంది.

క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో(Mumbai Cruise Drug Case) ఆర్యన్ ఖాన్ అరెస్టయిన దగ్గరి నుంచి నవాబ్ మాలిక్ సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఆరోపణలు చేయడమే కాకుండా ఫడణవీస్‌ను ఇందులోకి లాగారు. డ్రగ్స్ సరఫరాదారుతో మాజీ ముఖ్యమంత్రి దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.

దీనిపై ఫడణవీస్ స్పందిస్తూ.. దీపావళి తర్వాత అన్నింటికీ సమాధానం చెప్తామన్నారు. అలాగే మాలిక్‌కు(Nawab Malik Latest News) అండర్‌ వరల్డ్‌తో ఉన్న సంబంధాలను బహిర్గతం చేస్తామన్నారు. దానిలో భాగంగానే ఈ మీడియా సమావేశం నిర్వహించారు.

ఇదీ చూడండి: 'ఆర్యన్​​ కిడ్నాప్​కు వాంఖడే స్కెచ్- షారుక్​కు బెదిరింపులు!​'

Last Updated : Nov 9, 2021, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.