పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు లేఖ రాశారు. రైతుల ఆందోళనలో భాగంగా వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని.. వారి డిమాండ్లను పరిష్కరించాలని ఆ లేఖలో కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను పంజాబ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వొద్దని సీఎంకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 32 వ్యవసాయ సంఘాల ప్రతినిధులను కలిసిన రెండు రోజులకు సిద్ధూ ఈ లేఖ రాయడం గమనార్హం.
"వ్యవసాయ చట్టాల రద్దు కోసం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో రైతులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లు అన్యాయమైనవి. వాటిని రద్దు చేయాలని రైతు సంఘాల తరఫున సీఎంను డిమాండ్ చేస్తున్నా."
-నవజోత్ సింగ్ సిద్ధూ
'ప్రైవేట్ మార్కెట్‌ల కోసమే వివిధ నిబంధనల పేరుతో 'వన్ నేషన్-టూ మార్కెట్లను కేంద్రం రూపొందిస్తోందని' సిద్ధూ ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలపై పోరులో ప్రతి దశలోనూ కాంగ్రెస్ అండగా నిలుస్తుందని రైతులకు సిద్ధూ భరోసానిచ్చారు.
ఇవీ చదవండి: